Heroine Poorna : హీరోయిన్ పూర్ణ గత ఏడాది వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని ఆమె పెళ్లాడారు. పూర్ణ ఆయన్ని రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఎంగేజ్మెంట్ విషయం సోషల్ మీడియాలో పంచుకున్న పూర్ణ, పెళ్లి మేటర్ చెప్పలేదు. సడన్ గా ఓ రోజు నాకు పెళ్ళైపోయిందని బాంబు పేల్చింది. 2022 జూన్లో షానిద్ తో నా వివాహం జరిగింది. దుబాయ్ లో అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్నాం. పెళ్ళికి ఎవరినీ ఆహ్వానించలేదు. ఇండియాలో మాత్రం రిసెప్షన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాం అన్నారు.
అయితే పూర్ణ ఎలాంటి రిసెప్షన్ జరపలేదు. అంతలోనే తల్లయింది. పెళ్ళైన వెంటనే ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు. ఏడాది తిరిగే లోపు పూర్ణ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఏప్రిల్ నెలలో ఆమెకు కొడుకు పుట్టాడు. దుబాయ్ ఆసుపత్రిలో పూర్ణకు ప్రసవం జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. పూర్ణ కొడుకు పేరు హమ్దాన్ అసిఫ్ అలీ. తరచుగా హమ్దాన్ ఫోటోలు పూర్ణ సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. ఆమె అభిమానులు క్యూట్ బేబీని చూసి మురిసిపోతుంటారు. మీ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడని కామెంట్స్ చేస్తుంటారు.
తాజాగా మరోసారి పూర్ణ కొడుకుతో కెమెరా ముందు ఫోజిలిచ్చారు. ఈ బ్యూటిఫుల్ మదర్, క్యూట్ సన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక నటిగా పూర్ణ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆమె క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. అఖండ, దసరా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో పూర్ణ కీలక పాత్రలు చేశారు. దసరా మూవీలో ఆమె విలన్ భార్య పాత్ర చేయడం విశేషం. పాత్రకు పెద్దగా నిడివి లేకున్నా కథను మలుపు తిప్పే సన్నివేశాల్లో ఆమె నటించారు.
కేరళకు చెందిన పూర్ణ అసలు పేరు షామ్నా ఖాసీం. పూర్ణ స్క్రీన్ నేమ్ మాత్రమే. పేరు చూసి ఆమె హిందువు అని కొందరు పొరపడుతుంటారు. 2004లో ఓ మలయాళ చిత్రంతో ఆమె కెరీర్ మొదలైంది. తెలుగులో శ్రీ మహాలక్ష్మీ మొదటి చిత్రం. ఆమెకు సీమటపాకాయ్ ఫేమ్ తెచ్చింది. అల్లరి నరేష్ హీరోగా నటించిన ఈ సీమటపాకాయ్ సూపర్ హిట్ కొట్టింది. హారర్ థ్రిల్లర్ అవును సైతం హిట్ టాక్ తెచ్చుకుంది. మంచి ఆరంభం లభించినా పూర్ణ స్టార్ కాలేకపోయింది.