Spy: హీరో నిఖిల్ కు ఇంతకంటే ఘోర అవమానం ఉండదనుకుంటా..!

ఈటీవీలో ఈ సినిమాకి 1.28 రేటింగ్ మాత్రమే వచ్చింది. వేరే హీరోల డిజాస్టర్ సినిమాలకి కూడా ఇంత తక్కువ రేటింగ్ ఎప్పుడు రాలేదు.

Written By: NARESH, Updated On : December 15, 2023 1:44 pm

Spy

Follow us on

Spy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిఖిల్ కి మంచి క్రేజ్ ఉంది. కార్తికేయ2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తనదైన గుర్తింపును చాటుకున్నాడు. తెలుగు హీరోల్లో పాన్ ఇండియా రేంజ్ లో హీరోగా పేరు సంపాదించుకున్న అతి తక్కువ మంది హీరోల్లో తనకూడా ఉండటం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి… అయినప్పటికీ కార్తికేయ 2 తర్వాత తను చేసిన స్పై సినిమా దారుణంగా నిరాశపరిచింది. అసలు అందులో స్టోరీ ఏమీ లేకుండా నిఖిల్ ఆ కథను ఎలా ఒప్పుకున్నాడు అంటూ విమర్శకుల నుంచి విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అయినప్పటికీ ఆ సినిమా థియేటర్ లో భారీ డిజాస్టర్ అయింది. ఇక గతవారం ఈ సినిమా ఈటీవీ ఛానల్ లో ప్రసారమైంది అక్కడ కూడా ఈ సినిమా దారుణం గా ఫెయిల్ అయిందనే చెప్పాలి.

ఎందుకంటే ఈటీవీలో ఈ సినిమాకి 1.28 రేటింగ్ మాత్రమే వచ్చింది. వేరే హీరోల డిజాస్టర్ సినిమాలకి కూడా ఇంత తక్కువ రేటింగ్ ఎప్పుడు రాలేదు. నిజానికి కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ క్రేజ్ తారాస్థాయిలో ఉంటే స్పై సినిమాతో ఆ క్రేజ్ మొత్తం పాతాళానికి పడిపోయింది. ప్రస్తుతం నిఖిల్ నార్మల్ స్టేజ్ లోనే ఉన్నాడు.ఇక ముందు రాబోయే సినిమాలతో నిఖిల్ ఒక మిరాకిల్ చేయాలి లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ అనేది మళ్లీ డౌన్ అయిపోతుంది. నిజానికి స్పై సినిమా స్టోరీ ని డైరెక్టర్ ఎలా చెప్పి ఒప్పించాడో తెలియదు కానీ అలాంటి కథలు చేయడం వల్ల నిఖిల్ తనకు తాను దారుణంగా లాస్ అయిపోవడం తప్ప ఏమి ఉండదు అనేది ఆ సినిమాను చూస్తే మనకు అర్థమవుతుంది.

నిజానికి ఆయన చేసిన సినిమాలు మినిమం గ్యారంటీ గా అయిన ఉంటాయి. కొన్ని సార్లు కాన్సెప్ట్ లో వైవిధ్యం లేకపోయిన ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే అంశాలు కొన్ని ఉంటాయి కానీ ఈ సినిమాలో అవేమీ ఉండవు దానివల్లే ఈ సినిమా రిలీజ్ అయిన టైం లో నిఖిల్ పైన భారీ ఎత్తున విమర్శలు సందించారు. నిఖిల్ అంటే ఒక మంచి హీరో అనే గుర్తింపు అయితే ఉంది. అయినప్పటికీ ఆయన ఎందుకు ఇలాంటి నాసిరకం కథలను సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేస్తున్నాడు అనేది తెలియదు. ప్రస్తుతం పెద్ద పెద్ద స్టార్ హీరోలకు సైతం సాధ్యం కానీ పాన్ ఇండియా మార్కెట్ అనేది నిఖిల్ కి సాధ్యం అయింది.

అలాంటి సందర్భంలో మంచి కథలతో పాన్ ఇండియా స్థాయి లో సినిమాలు చేసి స్టార్ హీరో అనిపించుకోవచ్చు కదా ఇలాంటి అల్ట్రా డిజాస్టర్ సినిమాలను ఎంచుకొని తనని తనే నాశనం చేసుకుంటున్నాడు అంటూ విమర్శకులు విమర్శిస్తున్నారు. ఇక ఇప్పటికైనా తను చేసే స్క్రిప్ట్ ల పట్ల కొంచెం జాగ్రత్త వహిస్తే నిఖిల్ తొందరలోనే స్టార్ హీరో అవుతాడు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…తన స్క్రిప్ట్ సెలక్షన్ మీదనే తన కెరియర్ డిపెండ్ అయి ఉంది…