https://oktelugu.com/

పూనమ్ పాండేపై కేసు నమోదు..

హాట్ హాట్ ఫొటోలతో నిత్యం సోషల్ మీడియాను హీటెక్కించే పూనమ్ పాండేపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ముంబైలోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో కారులో బాయ్ ఫ్రెండ్ తో షికారు చేసింది. ఎటువంటి కారణం లేకుండా రాత్రి 8గంటల సమయంలో బీచ్లో ఆమె చక్కర్లు కొడుతుండటాన్ని ముంబై పోలీసులు గుర్తించారు. వెంటనే ఆమె షికారు చేస్తున్న బీఎండబ్ల్యూ కారును సీజ్ చేశారు. పూనమ్ పాండేతోపాటు కారులో ఉన్న వ్యక్తిని అరెస్టుచేసి పలు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 11, 2020 / 03:53 PM IST
    Follow us on

    హాట్ హాట్ ఫొటోలతో నిత్యం సోషల్ మీడియాను హీటెక్కించే పూనమ్ పాండేపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ముంబైలోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో కారులో బాయ్ ఫ్రెండ్ తో షికారు చేసింది. ఎటువంటి కారణం లేకుండా రాత్రి 8గంటల సమయంలో బీచ్లో ఆమె చక్కర్లు కొడుతుండటాన్ని ముంబై పోలీసులు గుర్తించారు. వెంటనే ఆమె షికారు చేస్తున్న బీఎండబ్ల్యూ కారును సీజ్ చేశారు. పూనమ్ పాండేతోపాటు కారులో ఉన్న వ్యక్తిని అరెస్టుచేసి పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

    Also Read: అనసూయకు హిందీ ఆఫర్..

    గతంలో పూనమ్ పాండే పలు వివాదాలతో వార్తల్లో నిలిచింది. 2011లో టీంమీడియా ప్రపంచ కప్ గెలిస్తే నగ్నంగా నిలబడుతానంటూ ప్రకటించిన సంచలనం సృష్టించింది. అప్పట్లో ఆమె వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కాగా ఆమె పలు సినిమాల్లో నటించినా హీరోయిన్ గా మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. పూనమ్ పాండే ‘నాషా’, ‘లవ్‌ ఈజ్‌ పాయిజన్‌’, ‘మాలిని అండ్‌ కో’, ‘ఆగయా హీరో’, ‘ది జర్నీ ఆఫ్‌ కర్మ’ తదితర మూవీల్లో నటించింది. నిత్యం సోషల్ మీడియాలో కుర్రకారు మతిపోగొట్టేలా హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ అందరి అటెన్షన్ ను తనవైపు తిప్పుకోవడంతో పూనమ్ పాండే ఎప్పుడూ ముందే ఉంటుంది. తాజాగా రాత్రివేళ బీచ్లో షికార్లు చేస్తూ పోలీసులకు పట్టుబడటం ద్వారా మరోసారి వార్తల్లో నిలిచింది.