Poonam Kaur: కేరళ సాంప్రదాయ కట్టులో మెస్మరైజ్ చేసింది హీరోయిన్ పూనమ్ కౌర్. హ్యాండ్ లూమ్ పరిశ్రమను అభివృద్ధి చేయడం కోసం ఆమె ఈ ఫోటో షూట్ చేశారు. కేరళ కుట్టిగా పూనమ్ కౌర్ లుక్ సరికొత్తగా ఉంది. ఆమె అభిమానులకు పూనమ్ లేటెస్ట్ ఫోటో షూట్ ట్రీట్ అనడంలో సందేహం లేదు. పూనమ్ కట్టుకున్న ఆ చీర పూయం తిరునాళ్ పద్మనాభసేవినీ గౌరీ లక్ష్మీ బాయి బహుమతిగా ఇచ్చారట. ఆమె ఇచ్చిన చీరలో ఫోటో షూట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని పూనమ్ కౌర్ ఇంస్టాగ్రామ్ లో కామెంట్ చేశారు.
పూనమ్ కౌర్ 2006లో చిత్ర పరిశ్రమకు వచ్చారు. మాయాజాలం ఆమె మొదటి చిత్రం. అదే ఏడాది దర్శకుడు తేజ తెరకెక్కించిన ఒక వి చిత్రం మూవీలో నటించింది. ఒక వి చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. గోపీచంద్-అనుష్క శెట్టి జంటగా నటించిన శౌర్యం మూవీలో సపోర్టింగ్ రోల్ చేసింది. ఆ చిత్రంలో నటనకు గాను పూనమ్ కౌర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అందుకుంది.
పూనమ్ కౌర్ సపోర్టింగ్ రోల్స్ కే ఎక్కువగా పరిమితమైంది. అందం, అభినయం ఉండి కూడా ఆమెకు బ్రేక్ రాలేదు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ చిత్రాల్లో పూనమ్ కౌర్ నటించింది. ఆమె చివరిగా 2022లో నాతిచరామి అనే చిత్రంలో కనిపించారు. అయితే సోషల్ మీడియా పోస్ట్స్ తో పూనమ్ కౌర్ తరచుగా వార్తల్లో ఉంటుంది. ఆమె ట్విట్టర్ ఎక్స్ పోస్ట్స్ ఎవరితో టార్గెట్ చేసినట్లు ఉంటాయి.
దర్శకుడు త్రివిక్రమ్ పై పలుమార్లు పరోక్షంగా తన అసహనం వ్యక్తం చేసింది. ఈ మధ్య నేరుగా త్రివిక్రమ్ ని విమర్శిస్తూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్స్ పెట్టడం విశేషం. త్రివిక్రమ్ తో ఆమెకున్న వివాదం ఏమిటనేది తెలియదు. అలాగే భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో పాటు ఆమె కాలు కదిపింది. ఆయనతో పాటు ఓ రోజు యాత్ర చేసింది. ఇది పొలిటికల్ గా హీట్ రాజేసింది.