Homeఎంటర్టైన్మెంట్Poonam Kaur: పవన్ కి షాక్.. సీఎం జగన్ పై ఆ హీరోయిన్ ప్రశంసలు

Poonam Kaur: పవన్ కి షాక్.. సీఎం జగన్ పై ఆ హీరోయిన్ ప్రశంసలు

Poonam Kaur: ఏపీ ఎన్నికలవేళ బుధవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ట్విట్టర్ ఎక్స్ వేదికగా ప్రముఖ నటి పూనమ్ కౌర్ జగన్మోహన్ రెడ్డి పై ప్రశంసల జల్లు కురిపించింది. కోవిడ్ సమయంలో చేనేత కార్మికులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచిందని కొనియాడింది. ” కోవిడ్ ప్రబలిన సమయంలో నేత కార్మికులకు ప్రభుత్వం అండగా నిలిచింది. వారి అభ్యున్నతి కోసం మంచి పనులు చేసింది. ఇది చాలా గొప్ప విషయం. నేత కార్మికుల సమస్యలపై నేను క్రియాశీలకంగా పనిచేశాను. నా పరిశీలనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల చాలామంది బాగుపడ్డారంటూ” పూనమ్ కౌర్ ట్వీట్ చేయడం విశేషం.

పంజాబీ మూలాలు ఉన్న పూనమ్ కౌర్ కుటుంబం తెలంగాణలో చాలా సంవత్సరాల క్రితమే స్థిరపడింది. ఆమె 2008లో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. గోపీచంద్ హీరోగా రూపొందిన శౌర్యం అనే సినిమా లో అతడి చెల్లెలి పాత్రలను నటించింది. ఆ తర్వాత తమిళం, హిందీ చిత్రాల్లోనూ మెరిసింది. కొంతకాలంగా ఆమె అరుదైన వ్యాధితో బాధపడుతోంది. దాని నివారణకు గానూ ఆయుర్వేద విధానంలో చికిత్స తీసుకుంటోంది. ప్రస్తుతం ఆ వ్యాధి నుంచి తాను కోలుకున్నానని పూనం ఆ మధ్య ప్రకటించింది. వ్యాధి నుంచి కోరుకున్న తర్వాత చేనేత కార్మికుల సమస్యలను ఆమె అధ్యయనం చేస్తోంది.

పూనం కౌర్ కు, పవన్ కళ్యాణ్ కు, త్రివిక్రమ్ కు మధ్య ఎటువంటి వివాదాలు ఉన్నాయో తెలియదు గానీ.. గతంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ను పరోక్షంగా విమర్శలు చేసేది. ఇవి అప్పట్లో సంచలనంగా మారాయి. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ పూనం విమర్శలు మానుకుంది. కానీ హఠాత్తుగా ట్విట్టర్ వేదికగా జగన్మోహన్ రెడ్డిని ప్రశంసించడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. పూనం కౌర్ చేసిన ట్వీట్ ను వైసిపి నాయకులు తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటుండడం విశేషం. కాగా, పూనం కౌర్ చేసిన ట్వీట్ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ కు షాక్ అని వైసిపి అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version