Allu Arjun: గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా అడుగు పెట్టాడు. అయితే ఈ సినిమా సక్సెస్ అయితే ఇచ్చింది. కానీ ఆయనకి ప్రేక్షకుల్లో క్రేజ్ ను మాత్రం తీసుకురాలేకపోయింది. ఇక దానివల్లే ఆయన ఆ తర్వాత ఆర్య అనే సినిమాని సుకుమార్ డైరెక్షన్ లో చేసి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉండడంతో పాటుగా ఇండస్ట్రీలో తను కూడా స్టార్ హీరోగా ఎదుగుతూ వచ్చాడు.
ఇక ఆయన ఒక సినిమా కోసం చాలా డెడికేషన్ తో వర్క్ చేస్తారన్న విషయం కూడా మనకు తెలిసిందే. అందుకే ఆయన సినిమాల్లో డాన్సులు గాని, ఫైట్లు గాను చాలా స్టైలిష్ కి ఉంటూనే అన్ని చాలా కొత్తగా ఉంటాయి. ఇక డ్యాన్స్ లో అయితే ఆయన ప్రాణం పెట్టి స్టెప్పులు వేస్తాడనే చెప్పాలి.దేశముదురు సినిమా కోసం మొదటిసారిగా ఆ సినిమాలో సిక్స్ ప్యాక్ చేసి ఇండస్ట్రీ లో ఎవరికీ సాధ్యం కానీ ఒక అరుదైన రికార్డ్ ను క్రియేట్ చేసాడు…
ఇక బద్రీనాథ్ సినిమా కోసం అయితే చాలా కష్టపడటమే కాకుండా డాన్సులు గాని, ఫైట్లు గాని చాలా సాహసోపేతమైనవి చేస్తూ, ఆ సినిమా కోసం తను పూర్తిగా ఆయన ప్రాణాలకు తెగించి మరీ కొన్ని రిస్కీ షాట్స్ కూడా చేశారనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఆ సినిమాలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కి డూప్ లేకుండా తనే నటించడం విశేషం.
ఇలా ఒక సినిమా కోసం అల్లు అర్జున్ ఎంతకైనా తెగిస్తాడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక అందువల్లే తను ఈరోజు ఇండియాలోనే టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక తెలుగు లో ఎవరికి సాధ్యం కానీ రీతిలో పుష్ప సినిమాలో తను కనబర్చిన నటన కి ఉత్తమ నటుడు గా ‘నేషనల్ అవార్డు’ ని కూడా అందుకున్నాడు…ఇక ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు…ఈ సినిమా ఆగస్ట్ 15 న రిలీజ్ కి రెడీ అవుతుంది…