https://oktelugu.com/

Poonam Kaur: ఆమెకు గురూజీ చేసిన అన్యాయం ఏమిటీ..? నా సొంత అనుభవం, త్రివిక్రమ్ క్యారెక్టర్ ఇదంటూ పూనమ్ కౌర్ ఓపెన్ ట్వీట్!

Poonam Kaur: డార్క్ కామెడీ పేరుతో తండ్రీ కూతుళ్ళ బంధంపై నీచమైన కామెంట్లు చేశాడు. వీడియో బాగా వైరల్ అవడంతో హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా ఈ ఉదంతాన్ని తెరపైకి తెచ్చాడు. ఇలాంటి వాళ్ళని శిక్షించాలి అంటూ తెలుగు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల వరకు తీసుకువెళ్ళాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : July 11, 2024 3:48 pm
    Poonam Kaur once again slams on Trivikram

    Poonam Kaur once again slams on Trivikram

    Follow us on

    Poonam Kaur: పూనమ్ కౌర్ డైరెక్టర్ త్రివిక్రమ్ పై చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఛాన్స్ దొరికినప్పుడల్లా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ లపై పరోక్షంగా కౌంటర్లు వేస్తుంటుంది పూనమ్ కౌర్. అయితే తాజాగా త్రివిక్రమ్ పేరు డైరెక్ట్ గా ప్రస్తావిస్తూ ట్వీట్లు చేసింది. పైగా త్రివిక్రమ్ జీవితాలను నాశనం చేస్తాడంటూ ఓపెన్ గా విరుచుకుపడింది. ప్రణీత్ హనుమంతు… గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న పేరు.

    డార్క్ కామెడీ పేరుతో తండ్రీ కూతుళ్ళ బంధంపై నీచమైన కామెంట్లు చేశాడు. వీడియో బాగా వైరల్ అవడంతో హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా ఈ ఉదంతాన్ని తెరపైకి తెచ్చాడు. ఇలాంటి వాళ్ళని శిక్షించాలి అంటూ తెలుగు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల వరకు తీసుకువెళ్ళాడు. ప్రవీణ్ హనుమంతును అరెస్ట్ చేయించే వరకు వదల్లేదు. అయితే సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్స్ కి ఓ నెటిజన్ పవన్ కళ్యాణ్ సినిమా లోని డైలాగ్స్ ట్యాగ్ చేసాడు.

    జల్సా సినిమా లో పవన్ కళ్యాణ్ ‘ పడుకున్న అమ్మాయిని రేప్ చేస్తే ఏమొస్తుంది ‘ అని బ్రహ్మానందంతో చెబుతాడు. ఆ డైలాగ్ ని చూపిస్తూ ఇలాంటి వాళ్ళ వల్లే యూత్ చెడిపోతుంది. ముందు వీళ్ల పైన చర్యలు తీసుకొవాలి అంటూ కామెంట్ చేశాడు. సదరు పోస్ట్ పై రియాక్ట్ అయిన పూనమ్ ‘ ఆ డైలాగ్స్ రాసింది త్రివిక్రమ్ .. ఆయన నుంచి ఇంతకంటే ఏమి ఆశిస్తాము ‘ అని ట్వీట్ చేసింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఆమెకు కౌంటర్ ఇచ్చాడు.

    మీ వ్యక్తిగత కోపాన్ని ఇలా సోషల్ మీడియాలో చూపించకండి. త్రివిక్రమ్ గారి టాలెంట్ ఏంటో అందరికీ తెలుసు అని రిప్లై ఇచ్చాడు. మీ టైం బాగాలేకనో .. మీకు ట్యాలెంట్ లేకనో మీరు స్టార్ హీరోయిన్ అవలేదు. దానికి త్రివిక్రమ్ ఒక్కరే కారణం అయినట్లు బ్లేమ్ చేయకండి అని కౌంటర్ ఇచ్చాడు. దీనికి పూనమ్ కౌర్… ‘ త్రివిక్రమ్ క్యారెక్టర్ నాకు తెలుసు. ఆయనను సపోర్ట్ చేసే మగాళ్ళ గురించి కూడా తెలుసు. మీరు మీ తరపున చెప్తున్నారు. నేను అనుభవించింది చెప్తున్నాను. ఆయన నా జీవితాన్నే నాశనం చేశాడు’ అని సంచలన కామెంట్స్ చేసింది.

    అసలు త్రివిక్రమ్ పూనమ్ కౌర్ కి చేసిన అన్యాయం ఏమిటో ఇంత వరకు తెలియదు. అవకాశం వచ్చిన ప్రతిసారి త్రివిక్రమ్ మీద ఆమె ఆక్రోశం వ్యక్తం చేస్తుంది. నిజానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో పూనమ్ కౌర్ ఒక్క చిత్రం కూడా చేయలేదు. త్రివిక్రమ్-పూనమ్ కౌర్ మధ్య ఉన్న పరిచయం ఎలాంటిది? ఇద్దరి మధ్య ఏం నడిచింది? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న.

    తనపై ఎంత ఘాటైన విమర్శలు చేసినా త్రివిక్రమ్ ఏనాడూ నోరు మెదిపింది లేదు. ఆయన మౌనం వహిస్తారు. తనపై వచ్చే ఆరోపణలకు స్పందించరు. త్రివిక్రమ్ స్పందించకపోయినా.. పూనమ్ మాత్రం మాటల దాడి ఆపదు. 2006లో మాయాజాలం అనే ఓ చిత్రంతో పూనమ్ కౌర్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. ఆమెకు సెకండ్ హీరోయిన్, సపోర్టింగ్ రోల్స్ మాత్రమే దక్కాయి. ఇరవైకి పైగా చిత్రాల్లో నటించింది. ఫేమ్ రాబట్టలేకపోయింది. చివరిగా 2022లో విడుదలైన నాతిచరామి చిత్రంలో నటించింది. ఆమె నటనకు దూరమైనట్లు తెలుస్తుంది. దర్శక నిర్మాతలు కూడా ఆమెను పట్టించుకోవడం మానేశారు.