Mahesh Babu-Rajamouli: మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ప్రభాస్ కూడా నటిస్తున్నాడా..? క్యారెక్టర్ ఏంటంటే..?

Mahesh Babu-Rajamouli: మహేష్ బాబు ను పాన్ వరల్డ్ లో స్టార్ హీరోని చేయబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మహేష్ బాబు పాన్ ఇండియా సినిమా చేయకుండానే డైరెక్ట్ గా పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఇక రాజమౌళికి బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాతో...

Written By: Gopi, Updated On : July 11, 2024 3:33 pm

Is Prabhas also acting in Mahesh Babu Rajamouli movie

Follow us on

Mahesh Babu-Rajamouli: తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ నలుమూల విస్తరింపజేసిన దర్శకుడు రాజమౌళి.. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుని హీరోగా పెట్టి ఒక పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్నప్పటికీ, ఈ సినిమా సెట్స్ మీదకి ఎప్పుడు వెళుతుంది అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో మహేష్ బాబు ను పాన్ వరల్డ్ లో స్టార్ హీరోని చేయబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మహేష్ బాబు పాన్ ఇండియా సినిమా చేయకుండానే డైరెక్ట్ గా పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఇక రాజమౌళికి బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాతో వచ్చిన క్రేజ్ ని వాడుకొని ఈ సినిమాని ఎలాగైనా సరే వరల్డ్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నమోదు చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే పాన్ వరల్డ్ లోకి మహేష్ బాబు అడుగు పెడుతున్నాడు. కాబట్టి మరొక తెలుగు హీరోని కూడా వరల్డ్ సినిమా స్థాయి కి తీసుకెళ్లాలని రాజమౌళి భావిస్తున్నాడట. ఇక అందుకోసమే ఈ సినిమాలో మహేష్ బాబు ఒక సన్నివేశంలో చిక్కుల్లో పడతాడట. ఆయన ఏమి చేయలేని పరిస్థితి ఎదురవుతుందట. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి రౌడీలతో పోరాడి మరి మహేష్ బాబు ను సేవ్ చేస్తారట.

అలాంటి పాత్ర కోసం ప్రస్తుతం రాజమౌళి ప్రభాస్ ని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ క్యారెక్టర్ కు దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు స్క్రీన్ టైం ఉంటుందట. ప్రభాస్ ఐతే ఈ సినిమాకి మార్కెట్ పరంగా కూడా యూజ్ అవుతాడని, అలాగే ప్రభాస్ కూడా వరల్డ్ సినిమాలోకి అడుగుపెట్టినట్టుగా అవుతుందనే ఉద్దేశ్యం తోనే రాజమౌళి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఈ సినిమాతో రాజమౌళి కూడా పాన్ వరల్డ్ దర్శకులకు పోటీ ఇచ్చి అక్కడ తనను తాను ప్రూవ్ చేసుకొని అక్కడి వాళ్ళకి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా తోపు దర్శకులు ఉన్నారని తెలిసేలా చేయడమే తన లక్ష్యంగా తెలుస్తుంది.

మరి ఇలాంటి క్రమంలో రాజమౌళి చేస్తున్న ఈ ప్రయోగంలో మహేష్ బాబు, ప్రభాస్ ఇద్దరు కూడా తనకు చాలా వరకు హెల్ప్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ప్రభాస్ అయితే రీసెంట్ గా కల్కి సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి 1000 కోట్లు రాబట్టడమే కాకుండా ఈ సినిమా ఇండియాలోనే టాప్ మోస్ట్ సినిమాల్లో ఒకటిగా ఎదిగింది. కాబట్టి రాజమౌళి సినిమాలో చేయడానికి ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. రాజమౌళి కల్కి సినిమాలో ఒక కామియో రోల్ పోషించాడు.

అలాగే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఆ పాత్ర నవ్వులు పూయించే విధంగా ఉంది. ఇక మొత్తానికైతే మరోసారి ప్రభాస్ తో రాజమౌళి తో జతకట్టబోతున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఈ సినిమాకు సంభందించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ను రాజమౌళి తొందర్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సర్వం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది..ఇక ఈ గ్యాప్ లో సినిమా కు సంభందించిన కొన్ని సెట్స్ ను కూడా రెఢీ చేయించాడట…