https://oktelugu.com/

Poonam Kaur: త్రివిక్రమ్ కి పూనమ్ కౌర్ మరో ఘాటు కౌంటర్… ఆయనకు కావాల్సింది నా దగ్గర లేదంటూ ఓపెన్ అలిగేషన్స్, కామెంట్స్ వైరల్

Poonam Kaur: పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ఒక ఇండైరెక్ట్ పోస్ట్ వేసింది. సదరు పోస్ట్ లో ఎవరి పేరు ఆమె నేరుగా ప్రస్తావించలేదు. కానీ ఆమె పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి కామెంట్స్ చేసిందని నెటిజన్లు భావిస్తున్నారు. పూనమ్ కౌర్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : July 12, 2024 / 02:14 PM IST

    Poonam Kaur direct attack on Trivikram

    Follow us on

    Poonam Kaur: పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా వివాదాలు రాజేస్తోంది. కొందరు వ్యక్తులను టార్గెట్ చేస్తూ కౌంటర్స్ విసురుతుంది. అవి కాస్తా వైరల్ అవుతుంటాయి. పూనమ్ కౌర్ పలుమార్లు ఇన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ని ఉద్దేశిస్తూ ట్వీట్లు వేశారు. ముఖ్యంగా అవకాశం దొరికినప్పుడల్లా గురూజీ పై ఘాటైన విమర్శలు చేస్తుంది. అసలు త్రివిక్రమ్ తో మీకు ఉన్న సమస్య ఏంటని?.. నెటిజన్లు పలు మార్లు ప్రశ్నించారు. వీరి మధ్య ఏం జరిగిందో తెలియదు. కానీ పూనమ్ కౌర్ మాత్రం ఆయన్ని వదలడం లేదు. ఏ చిన్న అవకాశం కూడా వదిలిపెట్టడం లేదు. గతంలో పరోక్షంగా కామెంట్స్ చేసే పూనమ్ ఈ మధ్య నేరుగా త్రివిక్రమ్ పేరు ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తుంది.

    తాజాగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ఒక ఇండైరెక్ట్ పోస్ట్ వేసింది. సదరు పోస్ట్ లో ఎవరి పేరు ఆమె నేరుగా ప్రస్తావించలేదు. కానీ ఆమె పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి కామెంట్స్ చేసిందని నెటిజన్లు భావిస్తున్నారు. పూనమ్ కౌర్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.’ నాయకుడు ఒక స్త్రీని ఎలా గౌరవిస్తాడో అలానే అతని అనుచరులు గౌరవిస్తారు. నాయకుడు గా ఉండటం అనేది బాధ్యతాయుతమైన విషయం.

    కానీ చాలా మంది దానిని స్వీయ కీర్తి కోసం ఉపయోగిస్తారు. ప్రతి రాజకీయ నాయకుడు లీడర్ కాలేడు’ అని పూనమ్ ట్వీట్ చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ పోస్ట్ కి కౌంటర్ గా పూనమ్ కౌర్ ఈ కామెంట్ చేసింది. ”ఎప్పుడూ ఒకరి పై ఏడుస్తూనే ఉండు .. నీకు ఏమైనా పని ఉందా అసలు .. సినిమాలు లేవు .. సీరియల్స్ లేవు .. నీలాంటి లేజీ ఇడియట్ ని ఇండస్ట్రీ నుంచి తరిమి కొట్టి మంచి పని చేశారు” అని సదరు నెటిజన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

    మరో ట్వీట్ లో పూనమ్ .. ”గురూజీ ట్యాలెంట్ తొక్కేస్తాడు .. ఎస్కార్ట్స్ ని ఎంకరేజ్ చేస్తుంటాడు .. గురూజీ కి కావాల్సిన క్యారెక్టర్, టాలెంట్ నా దగ్గర లేదు” అని రిప్లై ఇచ్చింది. కానీ వెంటనే ఆ ట్వీట్ ని డిలీట్ చేసింది. పూనమ్ కౌర్ చేసిన ట్వీట్లు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఇక్కడ త్రివిక్రమ్ పేరు ఆమె ప్రస్తావించలేదు. అయితే త్రివిక్రమ్ కి గురూజీ నిక్ నేమ్ అన్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ తనని తొక్కేశాడని ఆమె ఆరోపిస్తున్నట్లు ఉంది. అందుకు కారణం ఆయన కోరుకున్నట్లు ఆమె వుండకపోవడమే. ఆయన నచ్చినట్లు ఉండేవాళ్లకు త్రివిక్రమ్ ఆఫర్స్ ఇస్తాడు.

    నాది అలాంటి క్యారెక్టర్ కాదు కాబట్టి ఆఫర్స్ లేకుండా పరిశ్రమలో ఎదగనీయ లేదని పూనమ్ కామెంట్స్ పరోక్షంగా తెలియజేస్తున్నాయి. ఇక త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ ఎన్ని విమర్శలు చేసినా ఆయన స్పందించిన దాఖలాలు లేవు. అలాగే త్రివిక్రమ్ సోషల్ మీడియా వాడడు. సినిమా వేడుకల్లో తప్పితే బయట కనిపించరు. కాగా పూనమ్ కి త్రివిక్రమ్ మీద అంత కోపం ఎందుకు అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఒక్క మూవీలో కూడా పూనమ్ నటించలేదు. అయితే ఆమె పరిశ్రమలో చాలా కాలంగా ఉంటున్నారు. కాబట్టి పరిచయం ఉంటుంది అనడంలో సందేహం లేదు. పూనమ్ కౌర్ తెలుగు, తమిళ భాషల్లో నటించింది.