Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా చేసి ఆ తర్వాత హీరోలుగా మారిన నటులు చాలామంది ఉన్నారు. నిజానికి వేరే వాళ్ళ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయడం వేరు. తమ సినిమాలో వాళ్లే మెయిన్ యాక్టర్ గా మారి సినిమా మొత్తాన్ని తనే నడిపించి సక్సెస్ లు కొట్టడం వేరు.. ఇక నిజానికి సినిమా ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోలు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించారు. వాళ్ళు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
తరుణ్
ముందుగా తరుణ్ కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడమే కాకుండా చాలా మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. ముఖ్యంగా తేజ అనే ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెయిన్ రోల్ లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలను కూడా అందుకున్నాడు. ఇక దాంతో పాటుగా వెంకటేష్ హీరోగా వచ్చిన ‘సూర్య ఐపిఎస్’, బాలయ్య బాబు హీరోగా వచ్చిన ‘ఆదిత్య 369’ సినిమాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ఒక మంచి పేరు ప్రఖ్యాతలనైతే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత నువ్వే కావాలి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయి లవర్ బాయ్ గా కూడా చాలా సంవత్సరాల పాటు తన ప్రస్తానాన్ని కొనసాగించాడు… ముఖ్యంగా అమ్మాయిల్లో చాలా మంచి క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. అప్పట్లో చాలా సంవత్సరాల పాటు ఈయన సినిమాలకి చాలా మంచి క్రేజ్ ఉండేది. కానీ కొన్ని పర్సనల్ కారణాల వల్ల ఆయన ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చింది…
జూనియర్ ఎన్టీయార్
జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడు బాల రామాయణం సినిమా చేసి చిన్నతనంలోనే నటుడి గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక చిన్నప్పుడు రాముడి పాత్రలో నటించడం అంటే ఎంత ఆశామాషి వ్యవహారం కాదు. అయినప్పటికీ తను చాలా అలవోకగా ఆ క్యారెక్టర్ లో నటించి బాల రాముడిగా గొప్ప పేరును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ‘నిన్ను చూడాలని’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోగా ముందుకు సాగుతున్నాడు…
తేజ సజ్జ
తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ముఖ్యంగా స్టార్ హీరోలందరితో నటించిన అనుభవం తనకు ఉంది. అందువల్లే తన నటన మేలుకోవలను చిన్నతనంలోనే చాలా బాగా నేర్చుకున్నాడు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో బాల నటుడిగా మెప్పించాడు.కాబట్టి ఇప్పుడు కూడా అదే నటనను కనబరుస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఆయన హీరోగా ‘ప్రశాంత్ వర్మ’ దర్శకత్వంలో వచ్చిన జాంబీరెడ్డి సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. రీసెంట్ గా ‘ హనుమాన్ ‘ అనే సినిమా చేసి పాన్ ఇండియా లో భారీ సక్సెస్ అందుకున్నాడు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈయన స్టార్ హీరోగా కూడా మారే అవకాశాలు ఉన్నాయంటూ పలువురు మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఇప్పటివరకు అయితే ఈయన చాలా మంచి గుర్తింపును సంపాదించుకొని ఫ్యూచర్ స్టార్ గా కూడా ఎదగబోతున్నాడు అనే విషయం తెలుస్తుంది…
ఇక వీళ్ళతోపాటు మరికొంతమంది చైల్డ్ ఆర్టిస్టులుగా చేసి హీరోలుగా మారినప్పటికీ వాళ్ళు అనుకున్నంత సక్సెస్ అయితే సాధించలేకపోతున్నారు. కొందరైతే ఒకటి రెండు సినిమాలను చేసి ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోతున్నారు.