Pooja Hegde: బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఒక్క సెల్ఫీతో సోషల్ మీడియాను షేక్ చేసింది. హాట్ క్లీవేజ్ షోతో ఫ్యాన్స్ మనసులు దోచేసింది. స్లీవ్ లెస్ ట్రెండీ వేర్ లో పూజా హెగ్డే స్కిన్ షోకి తెరలేపగా ఆమె సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. ప్రముఖ శీతల పానీయం మాజా ప్రచార కర్తగా ఉన్న పూజా హెగ్డే ఆ యాడ్ షూట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సెల్ఫీ వీడియో రికార్డు చేసి ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశారు. సదరు వీడియోలో పూజా గ్లామర్ కాకరేపుతుండగా ఫ్యాన్స్ పిచ్చ వైరల్ చేస్తున్నారు.

కెరీర్ జెట్ స్పీడ్ లో వెళుతుండగా పూజా హెగ్డే సూపర్ హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం పూజ చేతిలో మూడు బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సల్మాన్ ఖాన్ కి జంటగా కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఫర్హాద్ సామ్జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ లో వెంకటేష్ కీలక రోల్ చేయడం విశేషం. అలాగే జగపతి బాబు ఈ మూవీలో భాగమయ్యారు. 2023 రంజాన్ కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.
అలాగే పూజా ఖాతాలో ఉన్న మరో బాలీవుడ్ మూవీ సర్కస్. రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో పూజాతో పాటు జాక్విలిన్ ఫెర్నాండెజ్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. సర్కస్ చిత్రీకరణ చివర దశకు చేరినట్లు సమాచారం. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కి జంటగా SSMB 28లో పూజా హెగ్డే నటిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది.
ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో సెకండ్ షెడ్యూల్ కి సిద్దమవుతుంది. అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్ ప్రచారం అవుతుంది. దాదాపు ఈ టైటిల్ ఖాయమే అంటున్నారు. కాగా సెప్టెంబర్ 28న మహేష్ తల్లిగారైన ఇందిరా దేవి కన్నుమూశారు. ఈ విషాదంలో ఉన్న మహేష్ షూటింగ్ కి కొంచెం గ్యాప్ ఇచ్చే సూచనలు కలవు. 2023 సమ్మర్ కానుకగా SSMB 28 విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

ఒకప్పుడు లక్కీ హీరోయిన్ గా వరుస హిట్స్ కొట్టిన పూజా హెగ్డే.. ఇటీవల వరుస ప్లాప్స్ ఇచ్చారు. పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్, ఆచార్య ఆల్ టైం డిజాస్టర్స్ అయ్యాయి. కోట్లకు కోట్లు నష్టాలు మిగిల్చాయి. కోలీవుడ్ స్టార్ విజయ్ కి జంటగా బీస్ట్ మూవీ చేసింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన బీస్ట్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. హ్యాట్రిక్ ప్లాప్స్ పూర్తి చేసిన పూజా ఇమేజ్ కొంత డామేజ్ అయ్యింది. మరోవైపు విజయ్ దేవరకొండ తో చేయాల్సిన జనగణమన మూవీ అటకెక్కింది. లైగర్ డిజాస్టర్ కావడంతో జనగణమన మూవీ నిర్మాతలు ప్రాజెక్ట్ పక్కనపెట్టేశారు. దీంతో ఆమె మహేష్ మూవీతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తుంది.
[…] Also Read: Pooja Hegde: టాప్ ఉన్నా లేనట్లే.. హాట్ సెల్ఫీత… […]