Kajal Aggarwal: కొందరి విషయంలో ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే. వాళ్ళను చూస్తుంటే అసలు వయసు పెరుగుతుందా తరుగుతుందా అనే సందేహం కలుగుతుంది టాలీవుడ్ క్వీన్ చందమామ కాజల్ ని చూస్తే అదే భావన మనసులో మెదులుతుంది. 36ఏళ్ల ఈ ఎవర్ గ్రీన్ హీరోయిన్ వరుసగా క్రేజీ ఆఫర్స్ పట్టేయడమే కాకుండా, తనకు సాటిలేరని రుజువు చేస్తుంది. పెళ్లి చేసుకుని ఇల్లాలిగా మారినా, అమ్మడులో ఏమాత్రం జోరు తగ్గలేదు.
Also Read: మంత్రి కేటీఆర్ ట్వీట్ పై స్పందించిన నటి సమంత

2020 అక్టోబర్ లో తన లాంగ్ టర్మ్ బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లుని లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంది. లాక్ డౌన్ కావడంతో కేవలం అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సాధారణంగా పెళ్ళైతే కెరీర్ ముగిసినట్లే అంటారు. కాజల్ తన విషయంలో ఆ సూత్రం వర్తించదని నిరూపిస్తుంది.
ఇటీవల మొదటి యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ఈ జంట ఒకరికొకరు అన్నట్లు దాంపత్య జీవితం అనుభవిస్తున్నారు. భర్త గౌతమ్ వ్యాపారాలకు కాజల్ ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు. గౌతమ్ కి ఓ ఫర్నిచర్ సంస్థ ఉండగా, ఆ సంస్థ ఉత్పత్తులను కాజల్ ప్రమోట్ చేస్తూ… వ్యాపార పరంగా అతడు ఉన్నత స్థాయికి వెళ్లడంలో కృషి చేస్తుంది. కాజల్ తన భర్తను నటుడిగా కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం లేదు.
ప్రస్తుతం కాజల్ చేతిలో ఆచార్య, భారతీయుడు 2 వంటి రెండు భారీ చిత్రాలతో పాటు నాలుగు తమిళ చిత్రాలు ఉన్నాయి. ఆచార్య చిత్రంలో చిరంజీవికి జంటగా కాజల్ నటిస్తున్నారు. ఆయనతో కాజల్ కి ఇది రెండవ చిత్రం. గతంలో చిరు, కాజల్ కాంబినేషన్ లో ఖైదీ నెంబర్ 150 తెరకెక్కింది. ఆచార్య ఫిబ్రవరి 4న విడుదల కానుంది.
ఇక సోషల్ మీడియా ద్వారా కాజల్ తన గ్లామర్ పవర్ చూపిస్తుంది. లేటెస్ట్ గా డిజైనర్ ప్రింటెడ్ ఫ్రాక్ లో సూపర్ స్టైలిష్ గా కనిపించారు. ఆమె లుక్ చూస్తుంటే ఇంకా స్లిమ్ అయినట్లు అనిపిస్తున్నారు. కాజల్ ఫోటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ లైక్స్ కొడుతున్నారు. కాజల్ అందాన్ని చూస్తుంటే వన్నె తరగని చందమామలా ఉంది.
Also Read: ఎన్ని విమర్శలు వచ్చినా అతడిని వదలని సమంత..!