Pooja Hegde: ప్రభాస్, పూజా హెగ్డే ‘రాధేశ్యామ్’ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి ఆసక్తికర ముచ్చట్లు చెబుతున్నారు. అయితే, ముంబైలో జరిగిన ‘రాధేశ్యామ్’ ప్రమోషన్ ఈవెంట్ లో ప్రభాస్ – పూజ హెగ్డే అస్సలు మాట్లాడుకోలేదు. పైగా ఇద్దరు దూరదూరంగా నుంచున్నారు.

ఇది గమనించిన మీడియా ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ – పూజ హెగ్డేల మధ్య మనస్పర్థలు ఉన్నాయని, అందుకే, ప్రస్తుతం వారిద్దరు మధ్య మాటలు లేవని పుకార్లు పుట్టించారు. అసలు పక్కనే ఉన్నా హీరోహీరోయిన్ల మధ్య బాండింగ్, కెమిస్ట్రీ ఎలా మిస్ అయింది ? అంటూ వివిధ కథనాలను అనేక కోణాల్లో రాశారు.
Also Read: టీవీ ఇండస్ట్రీలో విషాదం.. జబర్ధస్త్ నటుడికి పెద్ద ప్రమాదం
పైగా ప్రభాస్, పూజా హెగ్డే ఎడమెహం, పెడమెహంగా ఉంటూ కనిపించిన కొన్ని క్లిపింగ్స్ ను కూడా చూపిస్తూ ఆ వార్తలకు మరింత బలం చేకూర్చారు. దాంతో ప్రేక్షకులు కూడా ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య ఎవో మనస్పర్థలు ఉన్నాయనుకున్నారు. అయితే, తాజాగా పూజా హెగ్డే ఈ పుకార్ల పై నిజానిజాలను వివరంగా వివరించింది.
ఈ క్రమంలో ప్రభాస్ గురించి పూజా హెగ్డే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘ప్రభాస్ తో నాకు ఎలాంటి మనస్పర్థలు లేవు. ప్రభాస్ గొప్ప మనసున్న మనిషి. నిజానికి షూటింగ్ సమయంలో సెట్ లో నాకు ఏ ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. నా కోసం ప్రభాస్ ప్రతి రోజు తన ఇంటి నుంచి స్వయంగా భోజనం తెప్పించి ఇచ్చేవారు.

అంత మంచి మనసు ఉన్న మనిషితో నాకు ఎందుకు మాటలు ఉండవు. ఈ అంశం పై వస్తున్న వార్తలన్నీ పుకార్లే. నేనే కాదు ఎవరైనా సరే ప్రభాస్ తో మాట్లాడకుండా ఉండలేరు’ అని పూజా హెగ్డే తెగ ఎగ్జైట్ అయిపోతూ చెప్పుకొచ్చింది .
Also Read: ప్రభాస్-అనుష్క పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన కృష్ణంరాజు భార్య
[…] […]