Pooja Hegde: ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్- పూజ హెగ్డేల మధ్య మనస్పర్థలు వచ్చాయని, వారిద్దరి మధ్య మాటలు లేవని వార్తలొచ్చాయి. దీనిపై ఓ ఇంటర్య్వూలో పూజ స్పందించింది. ‘ప్రభాస్ గొప్ప మనసున్న వ్యక్తి. ప్రతిరోజు తన ఇంటి నుంచి భోజనం తెప్పించేవారు. అంత మంచి మనిషితో నాకు మాటలు లేకపోవడమేమిటి? అదంతా పుకారు.

నేనే కాదు ఎవరైనా సరే ఆయనతో మాట్లాడకుండా ఉండలేరు’ అని పేర్కొంది. ఇక రాధేశ్యామ్ సినిమాలోని షిప్ ఎపిసోడ్ కోసం డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ రెండేళ్లు కష్టపడ్డారని పూజా చెప్పింది. ‘హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ సీన్ కోసం పనిచేశారు. ఈ సీన్ 13 నిమిషాలు ఉంటుంది.
Also Read: ‘సలార్’ గురించి అదిరిపోయే సీక్రెట్ చెప్పిన ప్రభాస్
సినిమాలో యాక్షన్ ఉంటుంది కానీ ఫైట్లు ఉండవు. లవ్, థ్రిల్లింగ్ అంశాలు ఉంటాయి అంటూ పూజా చెప్పుకొచ్చింది. ‘రాధే శ్యామ్’ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘రాధేశ్యామ్’లో ప్రేరణగా నటించిన పూజా హెగ్డే వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి బాగా ప్రమోట్ చేస్తోంది.

ఇక పూజా హెగ్డే కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. దాంతో అమ్మడు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. చాలా గ్యాప్ తర్వాత సినిమా ప్రమోషన్స్ కి వచ్చింది అన్నట్టు రాధే శ్యామ్ తో పాటు పూజా, విజయ్ కి జంటగా చేస్తున్న బీస్ట్ మూవీను కూడా పూర్తి చేసింది. అలాగే మహేష్ తో త్రివిక్రమ్ ప్రకటించిన చిత్రంతో పాటు, హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ ప్రకటించిన భవదీయుడు భగత్ సింగ్ చిత్రాలలో హీరోయిన్ గా పూజా పేరు పరిశీలనలో ఉంది.
Also Read: నేను సక్సెస్ ఫుల్ హీరోగా మారడానికి ఆమె కారణం – మెగాస్టార్
[…] Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్ షర్టు విప్పుతే తప్పులేదు, మేము పొట్టి బట్టలేసుకుంటే తప్పేంటి అని వాదించే వితండ వర్గం సోషల్ మీడియాలో ఒకటుంది. ఎప్పుడూ ఇలాంటి పనికిరాని తర్కంతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడిదంతా ఎందుకంటే, యాంకర్ అనసూయ ఉమన్స్ డేని ఫూల్స్ డే అని ట్వీట్ పెట్టిందట. అందరూ సుబ్బరంగా పండుగ జరుపుకుంటుంటే ఈ నెగిటివ్ ట్వీట్లు ఎందుకమ్మా అని అనసూయని తెగ ట్రోలింగ్ చేస్తున్నారట నెటిజన్లు. […]
[…] Anasuya Bharadwaj: అనసూయ అంటే పెద్దగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గానే కాకుండా అటు సినిమాల కెరీర్ పరంగా బాగానే సక్సెస్ సాధించిన ఈ బ్యూటీ.. సినిమాల్లో చాలా కీలకమైన పాత్రల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమాలో దాక్షాయణి పాత్ర ఆమెకు బాగా గుర్తింపు తెచ్చింది. ఇక మొన్న ఖిలాడీ మూవీలో కూడా ఆమె గుర్తుండిపోయే పాత్రను చేసింది. […]