https://oktelugu.com/

ఇండస్ట్రీలో ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్పిన పూజ హెగ్డే

సినిమా ప్రపంచంలో హిట్ కి ఉన్న విలువ ఇంకా దేనికి ఉండదు. స్టార్ హీరోని, హీరోయిన్ ని కూడా హిట్ ఉంటేనే ఇండస్ట్రీ గుర్తించుకుంటుంది. కొత్తగా వచ్చిన వాళ్లకి ఫ్లాప్ వస్తే ఐరన్ లెగ్ అని ముద్ర వేసేస్తుంది ఈ సినీ లోకం. వారికి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఒకరిద్దరు మాత్రమే దీనికి అతీతంగా ఉన్నారు. అందులో “పూజ హెగ్డే” ఒకరు… తమిళ్ లో మిస్కిన్ రాజ్ డైరెక్షన్ లో ‘ముగమూడి’ ద్వారా చిత్ర పరిశ్రమలోకి […]

Written By:
  • admin
  • , Updated On : December 22, 2020 / 03:22 PM IST
    Follow us on


    సినిమా ప్రపంచంలో హిట్ కి ఉన్న విలువ ఇంకా దేనికి ఉండదు. స్టార్ హీరోని, హీరోయిన్ ని కూడా హిట్ ఉంటేనే ఇండస్ట్రీ గుర్తించుకుంటుంది. కొత్తగా వచ్చిన వాళ్లకి ఫ్లాప్ వస్తే ఐరన్ లెగ్ అని ముద్ర వేసేస్తుంది ఈ సినీ లోకం. వారికి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఒకరిద్దరు మాత్రమే దీనికి అతీతంగా ఉన్నారు. అందులో “పూజ హెగ్డే” ఒకరు… తమిళ్ లో మిస్కిన్ రాజ్ డైరెక్షన్ లో ‘ముగమూడి’ ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది పూజా. ఆ మూవీ అట్టర్ ప్లాప్ అయ్యింది. తర్వాత తెలుగులో నాగ చైతన్యతో ‘ఒక లైలా కోసం’ లో నటించింది . ఆ మూవీ కూడా సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత అనూహ్యంగా అమ్మడికి హిందీలో హ్రితిక్ రోషన్ సరసన భారీ బడ్జెట్ పీరియడ్ ఆక్షన్ అడ్వెంచర్ మూవీలో సెలెక్ట్ అయ్యింది. పారితోషకం తీసుకోకుండా నటించింది. బిగ్ హీరో, బిగ్ డైరెక్టర్ కనుక హిట్ వస్తే దశ తిరిగిపోతుంది అనుకుంటే ఆ మూవీ కూడా దారుణంగా ఫెయిల్ అయ్యింది.

    Also Read: చిరుకు దోశ ఛాలెంజ్ విసిరిన చిలిపి సమంత

    ఇక పాప పని అయిపోయింది అనుకున్న తరుణంలో అల్లు అర్జున్ తో ‘దువ్వాడ జగన్నాధం’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సాక్ష్యంలో నటించినా ఆ మూవీలు కూడా నిరాశ పరిచాయి. నెక్స్ట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ మూవీతో తొలి విజయం దక్కింది. ఇక అక్కడ నుండి పాప రాత మారిపోయింది. నటించిన ప్రతి సినిమా హిట్ అవుతుంది. ఐరన్ లెగ్ కాస్త ఇప్పుడు గోల్డెన్ లెగ్ అయిపోయింది.అమ్మడు సోషల్ మీడియాలో కూడా కాంట్రావర్సీ హీరోయిన్ గా దూసుకుపోతుంది.

    Also Read: పవన్ డైరెక్టర్ కు త్రివిక్రమ్ వార్నింగ్!

    ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పూజా హెగ్డే చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. “ప్రతి రోజు కెమెరా ముందు ఉండడం కూడా అదృష్టమే అని అంటుంది ఈ భామ.అదృష్టం అంటే ఏంటి అన్న ప్రశ్నకు … అదృష్టం ఊరికే రాదు,ఎవరైతే కష్టపడి పని చేస్తారో అలాంటి వారిని అదృష్టం వరిస్తుంది.నిరంతర ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు అదృష్టం తలుపుతడుతుంది. సినీ రంగంలో ఉండాలంటే ఎంతో కష్టపడాలి, ఓపికగా ఉండాలి.కష్టం లేకుంటే ఎదగడం కష్టం” అని చెప్పింది. నిజమే అంత అదృష్టం ఉండబట్టే ఈ భామకి అన్ని అవకాశాలు వచ్చాయి, టాప్ హీరోయిన్ అయ్యింది. ప్రస్తుతం ఈమె అక్కినేని అఖిల్ సరసన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమాలలో అలానే హిందీలో కూడా ఒక మూవీలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్