https://oktelugu.com/

Pooja Hegde: సమంత కంటే ‘పూజా హెగ్డే’ రేటు 50 లక్షలు ఎక్కువ !

Pooja Hegde:  విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఎఫ్ 3’. క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ‘పూజా హెగ్డే’కి ఐటమ్ సాంగ్స్ కొత్తేమి కాదు. ‘రంగస్థలం’ సినిమాలో పూజా ‘జిగేల్ రాణి’ అంటూ ఓ ఐటమ్ పాట చేసింది. అయితే, ఆ సినిమా తర్వాత ‘పూజా హెగ్డే’ రేంజ్ పాన్ ఇండియా స్థాయిలో డబుల్ అయ్యింది. దాంతో.. అమ్మడు ఇక మళ్లీ ఐటమ్ పాటల […]

Written By:
  • Shiva
  • , Updated On : April 22, 2022 / 06:59 PM IST
    Follow us on

    Pooja Hegde:  విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఎఫ్ 3’. క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ‘పూజా హెగ్డే’కి ఐటమ్ సాంగ్స్ కొత్తేమి కాదు. ‘రంగస్థలం’ సినిమాలో పూజా ‘జిగేల్ రాణి’ అంటూ ఓ ఐటమ్ పాట చేసింది. అయితే, ఆ సినిమా తర్వాత ‘పూజా హెగ్డే’ రేంజ్ పాన్ ఇండియా స్థాయిలో డబుల్ అయ్యింది. దాంతో.. అమ్మడు ఇక మళ్లీ ఐటమ్ పాటల జోలికి పోలేదు. కానీ ‘ఎఫ్ 3’ కోసం చేసింది.

    Pooja Hegde

    ఎందుకు చేసింది ? అని అందరూ ఆశ్చర్యపోయారు. ఐతే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా.. పూజా తన క్రేజ్‌ను వాడుకుంది. పైగా సమంత కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంది. ‘ఊ అంటావా మావా..’ సాంగ్‌కి సమంత రూ.1.25 కోట్లు తీసుకుంది. కానీ, ‘పూజా హెగ్డే’ మాత్రం ఆ ఒక్క సాంగ్‌ కోసం ఏకంగా రూ.1.75 కోట్లు తీసుకుంది. అంటే సమంత కంటే 50 లక్షలు ఎక్కువ.

    Also Read: KGF 2 Collections: KGF 2 షాకింగ్ కలెక్షన్స్.. మరీ ఇంత దారుణమా ?

    నిజానికి ‘ఎఫ్ 3’ సినిమాలో ఐటెమ్ సాంగ్ లేదు. పూజా క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని దిల్ రాజు ఆమెను ఈ సాంగ్ చేయడానికి ఒప్పించాడు. కారణం.. ‘ఎఫ్ 3’ సినిమా డబ్బింగ్ వెర్షన్ కి హిందీలో గిరాకీ పెరగాలంటే.. పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్ చేత ఒక సాంగ్ చేయించాలి. పూజా కూడా ఈ ప్రత్యేక గీతం చేయడానికి అంగీకరించింది. మొదట్లో నో చెప్పినా.. ఒక రోజులో పాటను పూర్తి చేస్తాం.. రూ. 1 కోటి 50 లక్షలు ఇస్తాం అనగానే వెంటనే.. పూజా ఓకే చెప్పేసింది.

    Pooja Hegde

    ఈ పాట సూపర్ హిట్ అవుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. పైగా దిల్ రాజుకి బాక్సాఫీస్ లెక్కలు బాగా తెలుసు. ఆ లెక్కలకు అనుకూలంగానే ‘ఎఫ్ 3’ సినిమాలో అదిరిపోయే కమర్షియల్ ఎలిమెంట్స్ ను యాడ్ చేయిస్తున్నాడు. ఎలాగూ.. దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా అనగానే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.

    పైగా ఈ సినిమాలో కామెడీ.. హీరోల పాత్రల్లో నుండి మాత్రమే పుట్టుకొస్తోందట. అంత పర్ఫెక్ట్ గా అనిల్ ఈ సినిమాలో పాత్రలను డిజైన్ చేశాడు. ఇంతకీ సినిమాలో హీరోల పాత్రల విషయానికి వస్తే.. రేచీకటి ఉన్న వ్యక్తి పాత్రలో వెంకటేష్, నత్తితో నానాపాట్లు పడే వ్యక్తి పాత్రలో వరుణ్‌ తేజ్ నటిస్తున్నారని.. వీరి లోపాలు ఫుల్ ఎంటర్ టైన్ చేస్తాయని తెలుస్తోంది.

    Also Read:Chiranjeevi Tweet: మహేష్ కి థాంక్స్.. మెగా ఫ్యాన్స్ కిక్ ఇచ్చిన చిరు ట్వీట్ !

    Recommended Videos:

    Tags