Chandini Chowdary: చాందిని చౌదరి.. అచ్చ తెలుగు హీరోయిన్. అందుకే, తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో తనకు హీరోయిన్ గా ఛాన్స్ లు రావడం లేదు అంటూ తెగ బాధ పడిపోతుంది చాందిని చౌదరి. నిజానికి, కెరీర్ కొత్తల్లో ఎక్స్ పోజింగ్ విషయంలో చాందిని చౌదరి మొహమాట పడింది. దాంతో ఆమె కెరీర్ అనుకున్నంత స్పీడ్ గా సాగలేదు. నత్తలా నెమ్మదిగా సాగుతూ చిన్నాచితకా చిత్రాల హీరోయిన్ గానే చాందిని చౌదరి గుర్తింపు తెచ్చుకుంటూ వచ్చింది.
ఐతే, ప్రస్తుతానికి చాందిని చౌదరి చేతిలో తెలుగు సినిమాలకు సంబంధించి క్రేజీ ఆఫర్లేవీ లేవు. కానీ.. ఓటీటీలకు సంబంధించి ఆమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. కాకపోతే చాందిని చౌదరికి ఓటీటీ సినిమాలు కంటే కూడా.. థియేటర్ సినిమాలు చేయడమే బాగా ఇష్టం అట. అందుకే.. ఏ మాత్రం నిరాశ చెందకుండా ఛాన్స్ ల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
Also Read: Pooja Hegde: సమంత కంటే ‘పూజా హెగ్డే’ రేటు 50 లక్షలు ఎక్కువ !
ఈ క్రమంలో చాందిని చౌదరి తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది. ఛాన్స్ లు రావాలి అంటే.. బోల్డ్ గా కనిపించాలని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయానికి తగినట్టుగానే చాందిని చౌదరి ఈ మధ్య షేర్ చేస్తున్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చాందిని చౌదరి ఫోటోల మీద నెటిజన్లు కూడా రియాక్ట్ అవుతున్నారు. ‘ఇంత హాట్‌గా ఎలా తయారయ్యావ్ ?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
అయితే, పెద్ద సినిమాల్లో ఛాన్స్ ల కోసం చాందిని చౌదరి తన వైపు నుంచి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోన్నా… టాలీవుడ్ దర్శక నిర్మాతలు మాత్రం ఆమెను ఆదరించడం లేదు. అందుకే చాందిని చౌదరి గ్లామరస్ గా కనిపించేందుకు బోల్డ్ ఫోటో షూట్ లు చేస్తూ మొత్తానికి రచ్చ చేస్తోంది. అలాగే పరాయి భాషల భామలకు పోటీ ఇచ్చేందుకు బికినీ కూడా వేయడానికి సై అంటుంది.
పైగా చాందిని చౌదరి క్రమం తప్పకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటోలు షేర్ చేస్తోంది. ఇక రెగ్యులర్ గా తనకు సంబంధించిన అప్డేట్స్ నెటిజన్లతో పంచుకుంటూ ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి నానా కష్టాలు పడుతుంది. ఐతే, ఎంత చెట్టుకు అంతే గాలి అన్నట్టు చాందిని చౌదరి రేంజ్ మాత్రం పెరగడం లేదు. మరి చాందిని చౌదరికి దశ ఎప్పుడు తిరుగుతుందో చూడాలి.
Also Read:KGF 2 Collections: KGF 2 షాకింగ్ కలెక్షన్స్.. మరీ ఇంత దారుణమా ?
Recommended Videos: