spot_img
Homeఎంటర్టైన్మెంట్అందరికీ హగ్గులు, ముద్దులు ఇస్తోన్న 'పూజా హెగ్డే' !

అందరికీ హగ్గులు, ముద్దులు ఇస్తోన్న ‘పూజా హెగ్డే’ !

Pooja
‘బుట్ట బొమ్మ పూజా హెగ్డే’ తన ఫాలోయర్లకు, అలాగే తన అభిమానులకు హగ్గులు, ముద్దులు ఇస్తోంది. కాకపోతే డైరెక్ట్ గా కాదులేండి. తన ఇన్‌ స్టాగ్రామ్‌ ఎకౌంట్ నుండి ఈ హగ్గులు ముద్దులు ప్రోగ్రామ్ ను పెట్టుకుంది. ఎందుకు ఇంత సడెన్ గా ఈ డస్కీ బ్యూటీ ఈ పనిని పెట్టుకుందంటే.. అమ్మడికి అనందం కలిగింది. ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఈ బ్యూటీని ఫాలో చేస్తున్నవారి సంఖ్య 13 మిలియన్ల (1 కోటీ 30 లక్షలు) కు చేరుకుంది. దాంతో అనందం పట్టలేక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెసేజ్ పోస్ట్ చేస్తూ.. ‘‘ఫాలోయర్లు, అభిమానులు అందరికీ థ్యాంక్స్‌. మీ అందరికీ నా హగ్గులు, ముద్దులు’’ అంటూ పూజా హెగ్డే మెసేజ్ లో పోస్ట్ చేసింది.

ఏది ఏమైనా టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ తో చలామణి అవుతోన్న ఏకైక హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే.. ముందు వరుసలో నిలిచే పేరు ‘పూజా హెగ్డే’దే. అసలు బుట్ట బొమ్మలా లేకపోయినా ఈ టాల్ బ్యూటీకి బుట్ట బొమ్మ అంటూ మంచి ఫాలోయింగ్ క్రియేట్ అయింది. పైగా పూజా హెగ్డేకి ఇటు దక్షిణాది అభిమానులు రోజురోజుకూ పెరుగుతున్నట్లుగానే అటు ఉత్తరాది అభిమానులు కూడా రోజురోజుకూ పెరుగుతూ పోతూ ఉండటంతో అమ్మడికి బాలీవుడ్ లో కూడా బాగా డిమాండ్ ఉంది.

ఎప్పుడూ హాట్ ఫోటో షూట్ లతో పాటు యోగా, జిమ్‌ వీడియోలను కూడా ఎప్పటికప్పుడు తన సోషల్‌ మీడియా ఎకౌంట్స్ లో పోస్ట్‌ చేస్తూ ఫాలోయర్ల సంఖ్య పెంచుకుంటున్న ఈ బ్యూటీ.. యాడ్స్ కూడా బాగా చేస్తూ తన క్రేజ్ ను క్యాష్ చేసుకుంటుంది. ఇన్‌ స్టాగ్రామ్‌ లో 13 మిలియన్ల ఫాలోయర్ల సంఖ్యను పెంచుకోవడమే అమ్మడు ప్రస్తుత టార్గెట్ అట. ఇప్పుడు హీరోయిన్లు అంతా ఫాలోవర్ల పైనే పడ్డారు. ఎంత ఎక్కువమంది ఫాలోవర్లు ఉంటే, అంత ఎక్కువుగా యాడ్స్ వస్తున్నాయి. అలాగే అంత ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారు.

ఏది ఏమైనా పూజా లక్కీ హీరోయిన్. నిజానికి పూజా కంటే అందగత్తెలు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. ఇంకా వస్తూనే ఉన్నారు. అయినా ఈ డస్కీ బ్యూటీకి మొదటి నుండి మంచి డిమాండ్ క్రియేట్ అయింది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుంటే.. యాక్టింగ్ పరంగా ‘పూజా హెగ్డే’ గొప్ప నటి ఏమి కాదు. అయినా ఈ బ్యూటీకి చాల ఈజీగా స్టార్ డమ్ రావడం.. అది పాన్ ఇండియా రేంజ్ లో రావడం అంటే అది ఒక్క పూజాకే దక్కిన అదృష్టం.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Oktelugu Epaper
Exit mobile version