Homeఎంటర్టైన్మెంట్Pooja Hegde : డిప్రెషన్ లో పూజ హెగ్డే..సినిమాలకు త్వరలోనే గుడ్  బై చెప్పనుందా?

Pooja Hegde : డిప్రెషన్ లో పూజ హెగ్డే..సినిమాలకు త్వరలోనే గుడ్  బై చెప్పనుందా?

Pooja Hegde : సినీ రంగం లో ఎప్పుడు ఏమి జరుగుతుంది అనేది ఎవ్వరం చెప్పలేము , రాత్రికి రాత్రి స్టార్ సెలబ్రిటీస్ గా మారిపోవచ్చు, అదే స్టార్ సెలబ్రిటీస్ ఒకే ఒక్క రోజు లో తమ స్టార్ స్టేటస్ మొత్తాన్ని పోగొట్టుకోవచ్చు. పాపం పూజ హెగ్డే పరిస్థితి చూస్తుంటే ఇలాగే అనిపిస్తుంది. ‘ఒక లైలా కోసం’ చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా ఈమె, ఆ తర్వాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో ‘మోహెన్ జోదారో’ సినిమాలో హీరోయిన్ గా చేసింది.

ఆ సినిమా పెద్ద ఫ్లాప్ అవ్వడం తో రెండేళ్ల పాటు గ్యాప్ ఇచ్చి , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా కూడా పూజా హెగ్డే కి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఈమెకి టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సరసన నటించే దక్కింది.

అలా హిట్టు మీద హిట్టు కొడుతూ టాలీవుడ్ లో దూసుకుపోయిన ఈ హాట్ బ్యూటీ కి కోలీవుడ్ లో కూడా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. అలా కోలీవుడ్ లో ఆమె ఏకంగా విజయ్ హీరో గా నటించిన ‘బీస్ట్’ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కించుకుంది, ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత ఈమెకి బాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు వచ్చాయి, కానీ ఒక్క సూపర్ హిట్ సినిమా కూడా లేదు. అలా ఈమె చేస్తున్న ప్రతీ సినిమాలు ఫ్లాప్ అవ్వడం తో దర్శక నిర్మాతలు ఒక్కసారిగా ఈమెని పక్కకి నెట్టేశారు. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు, శ్రీలీల జోరుకి బాగా వెనుకబడిపోయింది. మరో బాధ కలిగించే విషయం ఏమిటంటే ఈమె హీరోయిన్ గా ఎంపిక కాబడ్డ ‘గుంటూరు కారం’ చిత్రం నుండి కూడా వైదొలగింది.

ఇది ఆమె చాలా పెద్ద అవమాన కరంగా ఫీల్ అవుతుందట. టైం అసలు ఏమాత్రం కలిసి రావడం లేదు అనే విషయాన్నీ గమనించిన పూజా హెగ్డే కొంతకాలం వరకు సినిమాలకు దూరం గా ఉంటే బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చిందట. పాపం నెంబర్ 1 హీరోయిన్ స్థాయి నుండి ఒక్కసారిగా ఈ రేంజ్ కి పడిపోతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...
Oktelugu Epaper
Exit mobile version