Pooja Hegde: అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ దర్శకుడిగా మారిన సందీప్ వంగ.. బాలీవుడ్లో రణబీర్ కపూర్‌తో ‘యానిమల్’ సినిమాను చేస్తున్నాడు. పైగా క్రియేటివ్ డైరెక్టర్ అనే పేరుతో పాటు బోల్డ్ డైరెక్టర్ గా అనే పేరును కూడా నేషనల్ రేంజ్ లో తెచ్చుకున్నాడు. మొత్తానికి ఒక్క సినిమానే రెండుసార్లు తీసి నేషనల్ డైరెక్టర్ రేంజ్ గుర్తింపు తెచ్చుకోవడం ఒక్క సందీప్ రెడ్డికే సాధ్యం అయింది అనుకుంటా. ఇక తన కొత్త సినిమాని బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో పరిణీతి చోప్రా కథానాయికగా నటిస్తోంది. కాగా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ను దర్శకుడు ప్లాన్ చేయగా.. ఇందుకోసం పూజా హెగ్డేను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. రంగస్థలంలో స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసిన ఆమె.. ‘యానిమల్’ కోసం అంగీకరిస్తుందో? లేదో? చూడాలి మరి. అయితే, ఈ విషయంలో సమంతను ఫాలో కావాలని పూజా హెగ్డే డిసైడ్ అయిందని టాక్ ఉంది.
Also Read: భర్త లైంగిక దాడి చేస్తుంటే భార్య వీడియో చిత్రీకరణ.. విజయవాడలో దారుణం
కాగా ఈ సినిమాలో రణబీర్‌తో పాటు అనిల్ కపూర్ కూడా నటిస్తున్నాడు. అన్నట్టు సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో యంగ్ బ్యూటీ కూడా నటించబోతుంది. ఇంతకీ ఎవరు ఆ బాలీవుడ్ యంగ్ బ్యూటీ అంటే.. ‘త్రిప్తీ డిమ్రీ’. పేరు కూడా డిఫరెంట్ గా ఉంది కదా. ఔను, ఆమె ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతుంది. అలాగే సీనియర్ నటుడు బాబీ డియోల్ కూడా ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. అనిల్ కపూర్ – రణబీర్ కపూర్ – బాబీ డియోల్ కాంబినేషన్ మల్టీస్టారర్ అంటే.. ఫుల్ క్రేజ్ ఉంటుంది.

మరి ఈ క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అన్నట్టు ఇప్పటికే ప్రీ-లుక్ టీజర్ లో రణబీర్ కపూర్ వాయిస్ తో బ్యాక్ డ్రాప్ లో కథను కూడా వినిపించారు కూడా. ఇదొక పునర్జన్మల కాన్సెప్ట్ అని ప్రీ-లుక్ టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. ‘హీరో తన తండ్రిని తరువాతి జీవితంలో తన కొడుకుగా జన్మించమని .. ఆ తర్వాత మళ్ళీ తండ్రిగా జన్మించమని కూడా అడుగుతాడు.
అంటే.. తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ డ్రామా ఈ సినిమా. ఇక మునుపెన్నడూ రాని సరికొత్త కాన్సెప్టుతో ఈ సినిమాని తీస్తున్నారని బాలీవుడ్ మీడియాలో బాగా టాక్ నడుస్తోంది. అన్నట్టు ఈ సినిమా కూడా హిట్ అయితే, ఇక సందీప్ రేంజ్ మాములుగా ఉండదు. బోల్డ్ కంటెంట్ కు నాంది పలికిన ‘అర్జున్ రెడ్డి’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ నుండి హిట్ సినిమా రావాలని ఆశిద్దాం.
Also Read: బాలీవుడ్ క్రేజీ ఆఫర్లు రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్లు వీళ్ళే !