Vijayawada:విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. పరాయి మహిళను అత్యంత దారుణంగా అత్యాచారం చేయడమే కాకుండా దాన్ని వీడియో తీసి బెదిరింపులకు గురి చేయడం సంచలనం కలిగిస్తోంది. పరాయి మహిళతో ఉంటే సహించలేని భార్య ఆమె భర్త వేరే మహిళతో కామకలాపాలు సాగిస్తుంటే దాన్ని వీడియో తీయడం గమనార్హం. దీంతో ఆమెను అనుభవించడమే కాకుండా తన స్నేహితుల కోరికలు కూడా తీర్చాలని పట్టుబట్టడంతో ఆమె పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

విజయవాడలో అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో ఓ వివాహిత (25) భర్త పిల్లలతో కలిసి ఉంటోంది. భర్త కేటరింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారి ఎదురింట్లో దిలీప్, తులసి దంపతులు కూడా నివాసం ఉంటున్నారు. దీంతో దిలీప్ కన్ను వివాహితపై పడింది. ఎలాగైనా ఆమెను అనుభవించాలనే దురాలోచన కలిగింది. దీనికి భార్య కూడా సహకరించింది.
ఇంట్లో ఎవరు లేని సమయంలో ఈ నెల 8న రాత్రి దిలీప్, తులసి వారి ఇంటికి వెళ్లి ఆమెను బలవంతంగా లాక్కొచ్చారు. అంతటితో ఆగకుండా ఆమెపై అత్యాచారం చేశారు. దీన్ని తులసి వీడియో తీసి భర్తకు సహకరించింది. అంతటితో ఆగకుండా రెండు మూడు రోజులు కూడా ఇదే విధంగా వివాహితను బలవంతంగా తీసుకెళ్తూ అతడు కామవాంఛలు తీర్చుకుంటుంటే భార్య దాన్ని మొత్తం వీడియో తీస్తూ భర్తకు సహకరించింది.
ఈ నేపథ్యంలో వీడియోను అడ్డం పెట్టుకుని తమ స్నేహితుల కోరికలు తీర్చాలని దిలీప్ వివాహితను బెదిరించాడు. దీంతో ఆమెకు ఏం చేయాలో తోచలేదు. తన జీవితాన్ని నాశనం చేయొద్దని వేడుకుంది. అయినా దిలీప్ వినలేదు. లేకపోతే ఈ వీడియోను అందరికి చూపిస్తామని బెదిరించాడు.దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. చివరకు కటకటాలపాలయ్యాడు.
Also Read: పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. రోజుకు రూ.416 ఆదా చేస్తే రూ.65 లక్షలు?
సహజంగా భార్యలు భర్త ఎవరితోనైనా సంబంధం పెట్టుకుంటేనే సహించరు. అలాంటిది వేరే మహిళతో భర్త సంభోగిస్తుంటే దాన్ని వీడియో తీయడమేమిటో అర్థం కావడం లేదు. విషయం విజయవాడలో సంచలనం కలుగుతోంది. వివాహితపై ఇంతటి దారుణానికి ఒడిగట్టడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దిలీప్ ను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
[…] […]