https://oktelugu.com/

పూజా హెగ్డే డబుల్ రోల్ అట !

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘రాధే శ్యామ్’. సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ చిత్రంలో పూజా హెగ్డే డ్యూయెల్ రోల్ అట. ట్విన్స్ అయినా పూజాలు ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు ప్రభాస్ పాత్రతో ప్రేమలో పడతారని.. అయితే చివర్లో ఒకరు మరొకరి కోసం తమ ప్రేమతో పాటు ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తారని మొత్తానికి తాజాగా రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమా పీరియాడిక్ మూవీ […]

Written By:
  • admin
  • , Updated On : August 14, 2020 / 03:44 PM IST
    Follow us on


    రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘రాధే శ్యామ్’. సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ చిత్రంలో పూజా హెగ్డే డ్యూయెల్ రోల్ అట. ట్విన్స్ అయినా పూజాలు ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు ప్రభాస్ పాత్రతో ప్రేమలో పడతారని.. అయితే చివర్లో ఒకరు మరొకరి కోసం తమ ప్రేమతో పాటు ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తారని మొత్తానికి తాజాగా రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమా పీరియాడిక్ మూవీ కావడంతో పూజా గెటప్ కూడా ఆనాటి ట్రెడిషనల్ క్లాసిక్ డాన్సర్ ను పోలి ఉంటుందట. మరి పూజా డబుల్ రోల్ ఉండబోతుందో చూడాలి.

    Also Read: బయటపడ్డ స్టార్ హీరోయిన్ బాగోతం !

    ట్రెడిషనల్ గెటప్ లో ఎలాగూ పూజా అదిరిపోతుంది. ఆ మధ్య విడుదలైన గద్దలకొండ గణేష్ చిత్రంలో కూడా పూజా 90ల నాటి ట్రెడిషినల్ గెటప్ లోనే కనిపించింది. కాగా ప్రభాస్ కూడా ఈ సినిమాలో రెండు లుక్స్ లో కనిపిస్తారని సినీ వర్గాలు చెబుతున్నాయి. రివేంజ్ స్టోరీతో సాగే ఓ థ్రిల్లింగ్ ప్రేమకథగా రానున్న ఈ సినిమా లాక్ డౌన్ కి ముందు జార్జియాలో చిత్రీకరణ జరుపుకుంది. కానీ ఇప్పుడు మళ్లీ అక్కడ షూట్ చేసే పరిస్థితి లేదు. అందుకే మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ షూట్ ను హైదరాబాద్ లోని అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో నవంబర్ నుండి షూట్ చేయనున్నారు.

    Also Read: స్టార్ హీరో ఇంటి కోడలు శృంగార పాఠాలు !

    ఇక సాహో ప్లాప్ దెబ్బకు ప్రభాస్ ఈ సినిమాలో ఫుల్ ఎంటర్టైన్ మెంట్ ఉండేలా చూసుకుంటున్నాడు. స్క్రిప్ట్ ను మళ్లీ ఒక్కసారి మొత్తం సరి చూసుకోమని ఇప్పటికే దర్శకుడి చేత కామెడీ యాంగిల్ పెంచేలా చర్యలు తీసుకున్నాడు. కాగా మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.