spot_img
Homeఎంటర్టైన్మెంట్Pooja Hegde Birthday: మాల్దీవ్స్ లో పూజా హెగ్డే... అర్ధనగ్నంగా బర్త్ డే సెలబ్రేషన్స్

Pooja Hegde Birthday: మాల్దీవ్స్ లో పూజా హెగ్డే… అర్ధనగ్నంగా బర్త్ డే సెలబ్రేషన్స్

Pooja Hegde Birthday: బుట్టబొమ్మ పూజా హెగ్డే అక్టోబర్ 13న బర్త్ డే జరుపుకుంది. జన్మదిన వేడుకల కోసం అమ్మడు మాల్దీవ్స్ చెక్కేసింది. అందమైన సాగర తీరంలో అర్ధనగ్నంగా ఎంజాయ్ చేస్తుంది. చిన్న షార్ట్, టాప్ ధరించి బోల్డ్ గా ఉన్న పూజా హెగ్డే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 1990 అక్టోబర్ 13న జన్మించిన పూజా హెగ్డే 33వ ఏట అడుగు పెట్టింది. పూజా కెరీర్ బిగినింగ్ నుండి ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఆమెకు భారీ ఆఫర్స్ వచ్చినా హిట్స్ పడేవి కావు.

ఒక లైలా కోసం, ముకుంద చిత్రాల్లో పూజా గ్లామర్ ఆకట్టుకుంది. అందుకే జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమెకు అవకాశాలు దక్కాయి. ఒక దశలో ఫేడ్ అవుట్ అవుతుందేమో అనిపించింది. రంగస్థలం మూవీతో ఐటెం భామగా కూడా మారింది. పూజాకు బ్రేక్ ఇచ్చిన ఘనత దర్శకుడు త్రివిక్రమ్ దే. ప్లాప్స్ లో ఉన్న ఆమెకు ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ ఇచ్చాడు.

అరవింద సమేత వీర రాఘవ చిత్రం నుండి ఆమె దశ తిరిగింది. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఆ చిత్రం సూపర్ హిట్ కొట్టింది. మహర్షి మూవీలో మహేష్ బాబు పక్కన జతకట్టి మరో హిట్ కొట్టింది. త్రివిక్రమ్ వరుసగా మరో ఛాన్స్ ఇచ్చాడు. అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ అందుకుంది. బుట్టబొమ్మగా టాలీవుడ్ లో పూజా స్థిరపడిపోయింది. ఇక స్టార్స్ పక్కన వరుస ఆఫర్స్ ఆమె తలుపు తట్టాయి. 2021 వరకు పూజా పట్టిందల్లా బంగారమే అయ్యింది.

అయితే 2022 నుండి పూజాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. రాధే శ్యామ్ తో మొదలైన పరాజయాల పరంపర కొనసాగుతోంది. పూజా హీరోయిన్ గా నటించిన ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ డిజాస్టర్స్ అయ్యాయి. దానికి తోడు గుంటూరు కారం నుండి తప్పుకోవాల్సి వచ్చింది. పవన్ పక్కన ఉస్తాద్ లో నటించాల్సి ఉండగా, ఆ ఆఫర్ కూడా చేజారింది. అధికారికంగా పూజా కొత్త చిత్రం ప్రకటించలేదు. నెక్స్ట్ సాయి ధరమ్ తేజ్ పక్కన చేస్తున్నట్లు సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Jeetendra Property

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...
Jogi Ramesh

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...
Akhil Akkineni

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...
Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...
Today 25 July 2026 Horoscope:

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...
Oktelugu Epaper