Pooja Hegde: మంగళూరు నుంచి వచ్చిన హస్కీ సోయగాల డస్కీ బ్యూటీ ‘పూజా హెగ్డే’. వరుణ్ తేజ్ ‘ముకుంద’లో గోపికమ్మగా తెలుగు తెరకు పరిచయం అయి, ‘రంగస్థలం’లో జిగేల్ రాణిలా అందాలను పరిచి.. మొత్తానికి త్రివిక్రముడు అనే పెద్ద తలకాయను పట్టుకుని.. వరుసగా ముగ్గురు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లను పట్టేసి.. మొత్తమ్మీద స్టార్ హీరోయిన్ గా చలామణి అయింది. ముఖ్యంగా ‘అల వైకుంఠపురములో’ సినిమాతో పూజా రేంజ్ మారిపోయింది.

ఇప్పుడు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది. ఈ సినిమాలో ‘పూజా హెగ్డే’ చాలా కష్టపడింది. పైగా ఇష్టంగా బికినీ వేసింది. అందుకే, ఈ సినిమా గురించి అనేక సంగతులు చెప్పుకొచ్చింది ‘పూజా హెగ్డే’. తనకు ఒకే రకమైన పాత్రలు చేయడం నచ్చదు అని, అయితే ఈ సినిమాలో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని, అందుకే ఈ పాత్ర చేశాను అని చెప్పుకొచ్చింది.
ఇక పూజా తన పర్సనల్ విషయాలు కూడా చెప్పింది. చిన్నప్పటినుంచీ తానూ టామ్‌బాయ్ టైపు అని, అందుకే ఎన్నడూ అబ్బాయిలు తనకు ప్రపోజ్ చేసేవారు కాదు అని, అందుకే అప్పట్లో తన అందం పై తనకు నమ్మకం ఉండేది కాదు అని, కానీ ఆ అందమే నేడు తనకు కెరీర్ ను ఇచ్చింది అని పూజా తెలియజేసింది.
ఇక ‘పూజా హెగ్డే’ పై నిర్మాతలు ప్రస్తుతం అసంతృప్తిగా ఉన్నారు. ఒక సినిమా సక్సెస్ కాగానే పారితోషికం పెంచేస్తూ పోతూ ఉంది. అదేమీ అంటే.. హీరోల పారితోషికం విషయంలో రాని చర్చలు, మా విషయంలోనే ఎందుకు అంటూ సీరియస్ అవుతుందట. అంటే.. పూజా దృష్టిలో హీరోలు హీరోయిన్లు ఒక్కటేనా ? అయినా, ఈ రోజుల్లో ఏ హీరో, హీరోయిన్ అయినా ఆ సినిమా ఆడుతుందన్న గ్యారెంటీ లేదు.
మరి అలాంటపుడు వాళ్ళు డిమాండ్ చేసినంత ఎందుకు ఇవ్వాలి ? కరోనా తర్వాత ఇదే ఆలోచన నిర్మాతల్లో ఎక్కువగా వస్తోంది. అందుకే, మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఏ నిర్మాత ఆసక్తి చూపించడం లేదు. చేస్తే చిన్న సినిమా చేయాలి, లేదంటే.. మార్కెట్ ఉన్న స్టార్ హీరోలతోనే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే, ‘పూజా హెగ్డే’కి ఈ మధ్య తెలుగులో అవకాశాలు తగ్గాయి.