Homeఎంటర్టైన్మెంట్Bheemla Nayak: యాక్షన్ బరిలోకి 'భీమ్లా నాయక్'!

Bheemla Nayak: యాక్షన్ బరిలోకి ‘భీమ్లా నాయక్’!

Bheemla Nayak: పవర్ స్టార్​ పవన్​ కళ్యాణ్​ – రానా దగ్గుపాటి కలయికలో వస్తున్న మల్టీ స్టారర్ చిత్రం భీమ్లా నాయక్​.  మళయాలి చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్​గా ఈ సినిమా రూపొందిస్తున్నారు. సాగర్​ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి కొత్త అప్​డేట్​ వినిపిస్తోంది. ఈ చిత్రంలోని పోరాట సన్నివేశాలను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సీన్స్​ ను రామోజీ ఫిల్మ్​ సిటీలో షూట్​ చేయనున్నారట.

bheemla-nayak-movie-shooting-in-progress

ఇటీవలే విడుదలైన టీజర్​ పవన్​ అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. మరోవైపు, సగం షూటింగ్​ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో పవన్​ కొత్త లుక్​లో కనిపించపోతున్నట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుడగా.. నవీన్ నూలి ఎడిటర్​ గా , రవి కె చంద్రన్‌ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్ నటించనుంది. మరోవైపు తెలుగు నేటివిటికి తగ్గట్లు ఈ సినిమా కథలో త్రివిక్రమ్​ కొన్ని మార్పులు చేశారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular