https://oktelugu.com/

Pooja Hegde: మద్యం కలుపుతూ బుట్టబొమ్మ వీడియో వైరల్​.. ఇంత చీప్​ టేస్ట్​ అనుకోలేదంటూ ట్రోల్స్​!

Pooja Hegde: ఇటీవలకాలలో సినీ తారంతా ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు ప్రకటలూ చేస్తూ చేతినిండా పనితో పాటు డబ్బులు పోగుచేసుకుంటున్నారు. మరికొంత మంది సోషల్​మీడియా వేదికగా పెయిడ్​ ప్రొమోషన్స్​ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుట్టబొమ్మ పూజా హెగ్డే మరోసారి పెయిడ్​ ప్రమోషన్స్​ చేసి.. నెటిజన్ల ట్రోల్స్​కు గురైంది. మద్యం ప్రమోషన్స్​కు పూజా కొత్తేం కాదు. గతంలో చాలా సార్సు ఈ ముద్దుగుమ్మ పలు బ్రాండ్స్ గురించి తన సోషల్​మీడియా వేేదికగా ప్రమోట్స్​ చేసింది. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 27, 2021 / 10:23 AM IST
    Follow us on

    Pooja Hegde: ఇటీవలకాలలో సినీ తారంతా ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు ప్రకటలూ చేస్తూ చేతినిండా పనితో పాటు డబ్బులు పోగుచేసుకుంటున్నారు. మరికొంత మంది సోషల్​మీడియా వేదికగా పెయిడ్​ ప్రొమోషన్స్​ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుట్టబొమ్మ పూజా హెగ్డే మరోసారి పెయిడ్​ ప్రమోషన్స్​ చేసి.. నెటిజన్ల ట్రోల్స్​కు గురైంది.

    Pooja Hegde

    మద్యం ప్రమోషన్స్​కు పూజా కొత్తేం కాదు. గతంలో చాలా సార్సు ఈ ముద్దుగుమ్మ పలు బ్రాండ్స్ గురించి తన సోషల్​మీడియా వేేదికగా ప్రమోట్స్​ చేసింది. తాజాగా, మరోసారి ఆల్కహాల్​ను ప్రమోట్​ చేస్తూ ఓ వీడియో పెట్టింది. ఈ క్రమంలోనే రెడ్​లేబుల్​ బ్రాండ్​ని గ్లాస్​లో పోసి.. ఐస్​క్యూబ్స్​తో కలుపుతూ.. డాన్స్ చేసింది పూజా.

    https://www.instagram.com/p/CWsmT7Fgk5K/?utm_source=ig_web_copy_link

    Also Read: దిశా పటానీ నిజంగానే సర్జరీ చేయించుకుందా?.. ట్రోల్స్​తో ఆడుకున్న నెటిజన్లు
    అంతే కాకుండా, హుక్​ స్టెప్స్ వేసి మరీ ఆకట్టుకుంది.. ఈ క్రమంలోనే జానీ వాకర్ రెడ్​లేబుల్​ బ్రాండ్​ను ప్రమోట్​ చేయాల్సిందిగా అభిమానులను కోరింది.  అలా చేసినవారికి బహుమతి కూడా ఇస్తానని చెప్పింది.

    ఈ ఛాలెంజ్​లో కేవలం 25 ఏళ్లు నిండినవారే పాల్గొనాలని పేర్కొంది. అయితే, ఈ వీడిఓపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. పూజా నీది ఇంత చీప్​ టేస్ట్ అనుకోలేదు అంటూ కొందరు పోస్ట్ చేయగా.. ఓ స్టార్​ హీరోయిన్​ అయ్యుండి ఆల్కహాల్​ను ప్రమోట్​ చేస్తున్నావా.. అంటూ మరికొందరు కామెంట్ల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. కాగా, ప్రస్తుతం పూజా ఆచార్య సినిమాలో నటిస్తోంది. ఇందులో చరణ్​కు జోడీగా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్​లు సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానుంది.

    Also Read: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్ట్ ఆదేశం…