https://oktelugu.com/

Bigg Boss Telugu 5: ఆ కంటెస్టెంట్ గెలుపు కోసం బయట రాజకీయం!

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ షో కీలక దశకు చేరుకుంది. మరో మూడు వారాల్లో ఫైనల్ జరగనుంది. హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉండగా… ఈ వారం ఒకరు వచ్చే వారం మరొకరు ఎలిమినేట్ కానున్నారు. మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్స్ ఫైనల్ కి వెళ్లనున్నారు. ఎలిమినేటయ్యే ఆ ఇద్దరూ కంటెస్టెంట్స్ సిరి, కాజల్, ప్రియాంకల నుండే అని విశ్వసనీయ సమాచారం. అంటే సీజన్ 5 టైటిల్ కోసం నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి పోటీపడనుందట. […]

Written By: , Updated On : December 4, 2021 / 03:20 PM IST
Follow us on

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ షో కీలక దశకు చేరుకుంది. మరో మూడు వారాల్లో ఫైనల్ జరగనుంది. హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉండగా… ఈ వారం ఒకరు వచ్చే వారం మరొకరు ఎలిమినేట్ కానున్నారు. మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్స్ ఫైనల్ కి వెళ్లనున్నారు. ఎలిమినేటయ్యే ఆ ఇద్దరూ కంటెస్టెంట్స్ సిరి, కాజల్, ప్రియాంకల నుండే అని విశ్వసనీయ సమాచారం. అంటే సీజన్ 5 టైటిల్ కోసం నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి పోటీపడనుందట.

Bigg Boss Telugu 5

Bigg Boss Telugu 5 Manas

హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య హోరాహోరీగా గేమ్ సాగుతుంటే, దానికి సరిసమానంగా బయట మరో గేమ్ నడుస్తుంది. ఎవరికి వారు తమ అభిమాన కంటెస్టెంట్స్ తరపున ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. సదరు కంటెస్టెంట్ కి ఓటు వేయాలంటూ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే హీరో మానస్ ని కొందరు మోసేస్తున్న తీరు అనుమానం కలిగిస్తుంది. మానస్ కోసం ఓటు అడగాలని, కొందరు సెలబ్రిటీలపై ఒత్తిడి తెస్తున్నారేమో అనే సందేహం కలుగుతుంది.

srirama chandra won ticket to finale in bigg boss season 5 telugu

Bigg Boss Telugu 5

Also Read: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో టికెట్ టు ఫీనాలే గెలిచింది అతడే…

అసలు మానస్ తో అంతగా అనుబంధం లేని కొందరు సెలెబ్రిటీలు పనిగట్టుకొని మానస్ కి ఓటు వేయాలంటూ వీడియో బైట్ లు విడుదల చేస్తున్నారు. మిగతా కంటెస్టెంట్స్ కోసం మాట్లాడిన సెలెబ్రిటీలు చాలా తక్కువ. కానీ మానస్ కోసం పలువురు బుల్లితెర వెండితెర సెలెబ్రిటీలు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మానస్ ని అంతగా ప్రమోట్ చేయాల్సిన అవసరం వారికేమిటో అర్థం కాని విషయం.

ఇప్పటికే హీరోయిన్ పూర్ణ, యాంకర్ సమీరా, అదిరే అభి, సింగర్ నోయల్, సింగర్ మధు ప్రియ, నటాషా… మానస్ కి ఓటు వేయాలని వీడియోలు విడుదల చేశారు. తాజాగా నేల టికెట్, రెడ్ చిత్రాల్లో నటించిన మాళవిక శర్మ మానస్ కి మద్దతుగా మాట్లాడారు. నిజానికి వీరితో మానస్ కి స్ట్రాంగ్ బాండింగ్ ఉండే అవకాశం లేదు. ఒకవేళ హౌస్ లో పెర్ఫార్మన్స్ చూసి ప్రమోట్ చేస్తున్నారు అనుకోవడానికి.. సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్ కంటే కూడా అతడు వెనుక ఉన్నాడు. మానస్ కి దక్కుతున్న ఈ ప్రచారం వెనుక అదృశ్య శక్తి ఉందని కొందరు భావిస్తున్నారు. కాగా మెగా ఫ్యాన్స్ మానస్ ని సప్పోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

Also Read: బిగ్ బాస్ లో షన్ను ని కాదని వేరే కంటస్టెంట్ కి మద్దతు తెలుపుతున్న దీప్తి సునైనా

Tags