Gharana Mogudu: ‘చిరు’ బాటలో బన్నీ ఎదిగాడు.. ‘ఘరానా మెగుడు’ కేరళలో రిలీజయ్యే ముందు జరిగిన పరిణామాలేంటో తెలుసా..?

Gharana Mogudu: మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్లో బిగ్గెస్టు హిట్టు ‘ఘరానా మొగుడు’. రాఘవేంద్ర రావు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ కమర్షియల్ గా కూడా మంచి విజయం సాధించింది. తమిళంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన మన్నన్ అనే సినిమాను ఘరానా మొగుడు గా రీమేక్ చేశారు. రజనీకాంత్ మన్నన్ మూవీని తమిళ ఇండస్ట్రీతో పాటు మలయాళంలోనూ డబ్ చేసి రిలీజ్ చేశారు. అయితే తెలుగులో తీసిన ఘరానా మొగుడు సినిమాను కూడా మలయాళంకు చెందిన సినీ […]

Written By: NARESH, Updated On : December 4, 2021 4:51 pm
Follow us on

Gharana Mogudu: మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్లో బిగ్గెస్టు హిట్టు ‘ఘరానా మొగుడు’. రాఘవేంద్ర రావు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ కమర్షియల్ గా కూడా మంచి విజయం సాధించింది. తమిళంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన మన్నన్ అనే సినిమాను ఘరానా మొగుడు గా రీమేక్ చేశారు. రజనీకాంత్ మన్నన్ మూవీని తమిళ ఇండస్ట్రీతో పాటు మలయాళంలోనూ డబ్ చేసి రిలీజ్ చేశారు. అయితే తెలుగులో తీసిన ఘరానా మొగుడు సినిమాను కూడా మలయాళంకు చెందిన సినీ ప్రముఖులు తమ రాష్ట్రంలో ‘హే హీరో’ అనేపేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమాతోనే తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమలకు అనుబంధం పెరిగిందని అంటున్నారు. ఒక తెలుగు సినిమా మలయాళంలో హిట్టు సాధించడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే..?

Gharana Mogudu

కె. విశ్వనాథ్ తీసిన ‘శంకరాభరణం’ సినిమాను మలయాళంలో డబ్ చేసిన రిలీజ్ చేశారు. ఇందులో సంభాషణలను మలయాళంలో చెప్పినా పాటలను యాజటీస్ గా తెలుగులోనే ఉంచారు. దీంతో ఈ సినిమా తిరువనంతపురంలో విజయవంతంగా నడిచింది. ఆ తరువాత అంతటి విజయాన్ని సొంతం చేసుకుంది ఘరానా మొగుడు. ఈ సినిమాలో చిరంజీవి అన్నిరకాల ఫర్ఫామెన్స్ చూపిస్తారు. కామెడీ టైమింగ్స్ తో పాటు ఎమెషనల్ గా కనిపిస్తాడు.

Gharana Mogudu

ఇక ఇందులో చిరు చేసిన డ్యాన్స్ తో కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఈ డ్యాన్స్ ను చూసి కేరళ సినీ ప్రేక్షకులు షాక్ తిన్నారట. ముందుగా ఇక్కడి ప్రముఖ నిర్మాణ సంస్థ ‘7 ఆర్ట్స్’ అనే సంస్థ కేవలం చిరంజీవి నటన ఆధారంగానే సినిమాలను మలయాళంలోకి డబ్ చేయాలని అనుకున్నారట. దీంతో వారు అనుకున్న విధంగానే అక్కడ సక్సెస్ సాధించింది. చిరంజీవితో పాటు నగ్మా రొమాన్స్ కు కూడా ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పుకుంటారు.

Gharana Mogudu

Also Read: Chiranjeevi Mohan Babu: హిట్లర్ సినిమాకు మోహన్ బాబును అనుకున్నారు…కానీ చిరంజీవి నటించాడు : అసలేం జరిగిందంటే..?

అప్పటి నుంచి మెగాస్టార్ కు కేరళలో ఫ్యాన్స్ పెరిగారు. ఇప్పుడు అదే స్టైల్లో అల్లు అర్జున్ కూడా డ్యాన్స్ ఇరగదీస్తుండడంతో మిగతా స్టార్లతో సమానంగా అల్లు అర్జున్ పేరు తెచ్చుకున్నాడు. ఇక్కడ అల్లు అర్జున్ అంటే కేరళ ఫ్యాన్స్ అతనికి మల్లు అర్జున్ అని పేరు పెట్టుకున్నారు. త్వరలో అల్లు అర్జున్ మూవీ పుష్ఫ కోసం అక్కడి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Also Read: Kamal Haasan Sridevi: శ్రీదేవిని కమల్ హాసన్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనా..?

Gharana Mogudu

Tags