Vijay Tamil Nadu politics: సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుకున్న హీరోలందరు ఆ తర్వాత రాజకీయ రంగం వైపు అడుగులు వేస్తున్న విషయం మనకు తెలిసిందే. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఎంజీఆర్ దగ్గర నుంచి తెలుగులో ఎన్టీఆర్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి నటులు రాజకీయ ప్రవేశం చేసిన వారే కావడం విశేషం… ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. ఇక తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి నటులు సైతం రాజకీయ ప్రవేశం చేసినప్పటికి వాళ్లకంత అచ్చి రాలేదు. దాంతో వెనుకడుగు వేసి మరోసారి సినిమాలనే చేస్తున్నారు. ఇక ప్రస్తుతం తలపతి విజయ్ సైతం కొత్త రాజకీయ పార్టీని పెట్టి తమిళనాడు రాజకీయ రంగంలో పెను సంచలనాలను క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. 2026వ సంవత్సరంలో జరగబోతున్న ఎలక్షన్స్ లో తను తన పార్టీ నుంచి పోటీ చేయడమే కాకుండా గవర్నమెంట్ ను ఫామ్ చేయగలిగే కెపాసిటి తనకు ఉందని తన ప్రతి మీటింగ్ లో చెబుతున్నాడు…
ఇదంతా చూస్తున్న చాలామంది సినిమా మేధావులు అలాగే నార్మల్ జనాలు సైతం రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి వాళ్ల వల్లే తమిళనాడు రాజకీయాన్ని మార్చడం కాలేదు. విజయ్ వల్ల ఏమవుతుంది అంటూ అతన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా విజయ్ కి గవర్నమెంట్ ను ఫామ్ చేయగలిగే కెపాసిటి ఉందా అనేది తను కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బాగుంటుంది.
ఇక ఈసారి జనాలు తనను నమ్మకపోయినా కూడా తను అదే విధంగా పార్టీని కన్సిస్టెన్సీగా కొనసాగిస్తే మాత్రం ఏదో ఒక రోజు తమిళనాడు రాజకీయ రంగంలో తను చక్రం తిప్పే రోజు రావచ్చని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి విజయ్ ఈ ఎలక్షన్స్ తర్వాత తన పార్టీ రిజల్ట్ చూసి పార్టీని అలాగే కొనసాగిస్తాడా?
లేదంటే ఇతర పార్టీల్లో విలీనం చేసే అవకాశం ఏదైనా ఉందా? అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికైతే ఆయన చేసిన ‘జననాయగన్’ సినిమా ఇంకా రిలీజ్ కైతే నోచుకోలేదు. తొందరలోనే ఈ సినిమాని రిలీజ్ చేసి ప్రేక్షకుల మన్ననలు పొందడానికి సిద్ధమవుతున్నాడు…