Sai Pallavi Sensational Decision: హీరోయిన్ సాయి పల్లవి అంటేనే హోమ్లీ బ్యూటీ. ఫ్యామిలీ హీరోయిన్. సింపుల్ గా చెప్పాలంటే.. సాయిపల్లవి రెగ్యులర్ హీరోయిన్లకు పూర్తి భిన్నం. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ లు కుటుంబ బంధాలను బలంగా చాటే విధంగా ఉంటాయి. అన్నిటికీ మించి సాయి పల్లవి సింప్లిసిటీకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అలాంటి హీరోయిన్ కాబట్టే.. ఓ రాజకీయ నాయకుడి కుమారుడు ప్రేమలో పడ్డాడు. ‘వర్కౌట్ కాదు నాయనా’ అంటూ తన కొడుక్కి ఆ నాయకుడు ఎన్నిసార్లు నచ్చచెప్పినా అతగాడు మాత్రం సాయి పల్లవి ప్రేమ నుంచి బయటకు రాలేకపోయాడు.

దాంతో.. కొడుకు బాధ చూడలేక.. ఆ రాజకీయ నాయకుడు నేరుగా సాయి పల్లవి ఇంటికి వెళ్ళాడు. ఆమె పేరెంట్స్ తో తాను టాప్ పొలిటీషియన్ అని, సంబంధం మాట్లాడటానికి వచ్చాను అని చెప్పాడు. ఇది ఊహించని సాయి పల్లవి పేరెంట్స్ షాక్ అయ్యారు. వెంటనే షూట్ లో ఉన్న తమ కుమార్తెకు ఫోన్ చేసి విషయం చెప్పారు. మరసటి రోజు సాయి పల్లవి సమక్షంలో మీటింగ్ జరిగింది.
సాయి పల్లవిని తన కుమారుడు ఇష్టపడ్డాడు అని, కాబట్టి.. ఆమెను తన ఇంటికి కోడలిగా చేసుకుంటానని.. సాయి పల్లవి ఒప్పుకుంటే త్వరలోనే గ్రాండ్ గా పెళ్లి చేస్తాను అని ఆ రాజకీయ నాయకుడు సంబంధం గురించి మాట్లాడుకుంటూ వెళ్ళాడు. ఆ పొలిటిషన్ చెప్పే మాటలు అన్నీ విన్న సాయి పల్లవి, అనంతరం ఆయనకు గౌరవ మర్యాదలు చేసి.. సున్నితంగా తనకు ఈ వివాహం ఇష్టం లేదని తేల్చి చెప్పింది.

సాయి పల్లవి తన మొహం మీదే అలా చెప్పడంతో ఆ రాజకీయ నాయకుడు షాక్ అయ్యాడు. పైగా తనకు ఇప్పట్లో వివాహం చేసుకోవాలనే ఆలోచన కూడా లేదని.. ఒకవేళ వచ్చినా.. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారిని మాత్రం తాను అసలు వివాహం చేసుకోనని సాయి పల్లవి క్లారిటీ ఇచ్చింది. దాంతో ఫీల్ అయిన ఆ రాజకీయ నాయకుడు తనకు ఉన్న వందల కోట్ల ఆస్తుల గురించి ఆవేశంగా చెప్పి వెనక్కి తిరిగి వచ్చాడట.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఎన్టీఆర్ కు సాయి పల్లవి ఫిక్స్ అయ్యింది అని గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతుందట.
పైగా ఈ మధ్య ఎక్కువగా సాయి పల్లవి లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటిస్తోంది. ఈ క్రమంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో వచ్చిన ‘గార్గి’ సినిమా భారీ విజయాన్ని సాధించింది.