Bigg Boss 9 Telugu Day 52: ప్రతీ బిగ్ బాస్ సీజన్ లోనూ లవ్ ట్రాక్స్ ఉండడం సహజమే. హిందీ బిగ్ బాస్ లో అయితే ఏకంగా రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. మన తెలుగు లో ఇంకా ఆ స్థాయికి షో వెళ్ళలేదు కానీ, లవ్ ట్రాక్స్ లేని బిగ్ బాస్ తెలుగు సీజన్ అంటూ ఏది లేదు. కేవలం సీజన్ 6 లో మాత్రమే ఇలాంటి ట్రాక్స్ లేవు. అయితే ప్రస్తుతం నడుస్తున్న సీజన్ 9(Bigg Boss 9 Telugu) లో మాత్రం లవ్ ట్రాక్స్ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు నడుస్తున్నాయి. అందులో తనూజ, కళ్యాణ్ లది ప్రేమనా?, స్నేహమా అనే క్లారిటీ ఆడియన్స్ కి మాత్రమే కాదు, వాళ్లకు కూడా లేదు. ఇక రీతూ చౌదరి, డిమోన్ పవన్ లవ్ ట్రాక్ అయితే వేరే లెవెల్ అనుకోవచ్చు. భార్యాభర్తలు లాగా ప్రతీ రోజు వీళ్లిద్దరు హౌస్ లో గొడవలు పడుతూనే ఉంటారు.
ప్రతీ ఎపిసోడ్ లో వీళ్లిద్దరికీ సంబంధించిన కంటెంట్ కనీసం పది నిమిషాలు అయినా ఉంటుంది. ఈ ట్రాక్స్ సంగతి పక్కన పెడితే, భరణి,మాధురి ల లవ్ ట్రాక్ ని సోషల్ మీడియా లో మీమర్స్ క్రియేట్ చేశారు. హౌస్ లోకి భరణి రీ ఎంట్రీ ఇచ్చి అందరితో మాట్లాడుతూ ముందుకు వెళ్తాడు. అప్పుడు మాధురి వద్దకు వచ్చి, ఈరోజు ఏమి వంట చేశారు అని అడుగుతాడు. చికెన్ వండుతాను ఈరోజు అని అంటుంది. ఆ తర్వాత ఆమె భరణి కి ప్రేమతో వడ్డిస్తున్న వీడియో కూడా సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. దీంతో వీళ్లిద్దరి మధ్య ఒక డ్యూయెట్ సాంగ్ ని క్రియేట్ చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేశారు మీమర్స్, ఇది ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. చాలా ఫన్నీ గా కూడా అనిపించింది ఈ వీడియో.
నిజానికి వీళ్లిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. కాకపోతే భరణి ని చూసిన వెంటనే ‘మనోడు’ అనే ఫీలింగ్ హౌస్ మేట్స్ అందరికీ ఎలా కలిగిందో, మాధురికి కూడా అలాగే కలిగింది. కానీ ఇద్దరూ ఒకే వయస్సు కి సంబంధించిన వాళ్ళు కాబట్టి, తనూజ కి భరణి నాన్న లాగ, మాధురి అమ్మ లాగా వ్యవహరిస్తున్నారు కాబట్టి, వీళ్ళిద్దరినీ ఒకటి చేస్తే పోలా అనే ఉద్దేశ్యంతో సోషల్ మీడియా లో ఎన్నో ఫన్నీ మీమ్స్ వచ్చాయి. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న మీమ్ వీడియో ని మీరు కూడా చూసి ఎంజాయ్ చెయ్యండి. పొరపాటున ఈ వీడియోస్ మాధురి భర్త దువ్వ శ్రీనివాస్ చూస్తే ఈ మీమర్స్ పరిస్థితి ఏంటో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
#Biggbosstelugu9 pic.twitter.com/gJRcIXnIo3
— AkkaBro_Edits (@anuram2020) October 29, 2025