Vivek Oberoi Comments On Sandeep Reddy Vanga: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు గొప్ప విజయాలను సాధించి వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నారు. కానీ అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డివంగా… ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అర్జున్ రెడ్డి సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత ఆయన ఆ సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా సూపర్ హిట్ సాధించాడు. ఆ తర్వాత రణ్బీర్ కపూర్ ని హీరోగా పెట్టి చేసిన అనిమల్ సినిమా భారీ రికార్డులను కొల్లగొట్టింది… ఇక బాలీవుడ్ నటుడు అయిన వివేక్ ఒబెరాయ్ రీసెంట్ గా ఒక పోర్ట్ కాస్ట్ లో పాల్గొన్నప్పుడు సందీప్ రెడ్డి వంగ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు.
సందీప్ కి సినిమా అంటే పిచ్చి అని, తనకి సినిమా తప్ప వేరే ప్రపంచం లేదని చెప్పాడు. తను చాలా కమిట్ మెంట్ తో వర్క్ చేస్తాడని చెప్పాడు. అర్జున్ రెడ్డి సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత ఒకరోజు నేను తనకి కాల్ చేశానని ఆయన వర్క్ చాలా బాగుంటుందని చెప్పాను. తను కూడా నా మాటలను చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు.
దాంతో ఒకసారి మనిద్దరం కలుద్దామని చెప్పడంతో ఇప్పుడే డిన్నర్ కి వచ్చేసేయండి అని చెప్పాడు. తను చాలా హానెస్ట్ గా ఉంటాడు. అర్జున్ రెడ్డి మూవీకి ప్రొడ్యూసర్ ఎవరు దొరక్కపోతే తనే తన మామిడి తోటలను అమ్మేసి సినిమా చేశాడు అంటే అతనికి సినిమా అంటే ఎంత పిచ్చి ఉండాలి. ఒకవేళ సినిమా తేడా కొట్టిన ఏదైనా జరిగినా కూడా ఫ్యామిలీ మొత్తం రిస్కు లో పడిపోతోందని ఆలోచించకుండా తనమీద తనకున్న నమ్మకంతో సినిమా చేసి సక్సెస్ ని సాధించాడు అంటే అతని టాలెంట్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.
మొత్తానికైతే సందీప్ ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లందరిలో టాప్ డైరెక్టర్ గా ఎదిగాడని చెప్పాడు. అలాగే తన సినిమాలను ఎంతమంది క్రిటిసైజ్ చేసిన తన మీద ఎన్ని విమర్శలు చేసినా కూడా వాటన్నింటినీ పట్టించుకోకుండా తను సినిమాను మాత్రమే నమ్ముకొని ముందుకు సాగుతున్నాడు. కాబట్టి అతను అత్యుత్తమమైన స్థాయికి వెళ్తాడు అంటూ వివేక్ రాయ్ చెప్పిన మాటలు ఇప్పుడు సందీప్ రెడ్డివంగా అభిమానులను ఆనందపరుస్తున్నాయి…