https://oktelugu.com/

Allu Arjun : అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్..ఆ వీడియో ని ప్రచారం చేసినవాళ్ళని వదిలిపెట్టం అంటూ అల్టిమేటం!

సంధ్య థియేటర్ తొక్కిసిలాట ఘటన రోజురోజుకి కొత్త మలుపులు తీసుకుంటుంది. పోలీసులు అల్లు అర్జున్ థియేటర్ లో ఉన్న సమయంలోనే తొక్కిసిలాట జరిగిందంటూ ఒక వీడియో ని విడుదల చేసారు.

Written By:
  • Vicky
  • , Updated On : December 25, 2024 / 01:37 PM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసిలాట ఘటన రోజురోజుకి కొత్త మలుపులు తీసుకుంటుంది. పోలీసులు అల్లు అర్జున్ థియేటర్ లో ఉన్న సమయంలోనే తొక్కిసిలాట జరిగిందంటూ ఒక వీడియో ని విడుదల చేసారు. కానీ నిన్న సంధ్య థియేటర్ లోని సీసీటీవీ కెమెరా కి సంబంధించిన ఒక వీడియో వైరల్ అయ్యింది. అందులో ఈ ఘటన జరిగి, రేవతి ని థియేటర్ నుండి బయటకి తీసుకొస్తున్న సమయం 9 గంటల 15 నిమిషాలు ఉంది. అల్లు అర్జున్ థియేటర్ కి వచ్చింది 9 గంటల 35 నిమిషాలకు. అంటే అల్లు అర్జున్ రాక ముందే ఈ ఘటన జరిగిందని, అన్యాయంగా అల్లు అర్జున్ ని ఈ కేసు లో ఇరికిస్తున్నారంటూ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేసారు. దీనికి పోలీసుల నుండి కాసేపటి క్రితమే చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

    వాళ్ళు మాట్లాడుతూ ‘ సంధ్య థియేటర్ ఘటనపై ఎవరైనా ఫేక్ ప్రచారాలు చేసి, ఫేక్ వీడియోలు పోస్టు చేస్తే చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము. నిన్న కొంతమంది అల్లు అర్జున్ థియేటర్ కి రాకముందే తొక్కిసిలాట జరిగినట్టు, ఫేక్ టైం స్టాంప్ ఉన్న వీడియో ని సిర్క్యులేట్ చేసినట్టు మా దృష్టికి వచ్చింది. ఈ ఘటనపై విచారణ ప్రక్రియ జరుగుతున్న క్రమం లో నిజానిజాలను వీడియో రూపం లో పోలీస్ శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది. అయినప్పటికీ కొందరు జనాలను తప్పుదోవ పట్టించేలా అల్లు అర్జున్ రాకముందే ఈ దుర్ఘటన జరిగినట్టు ఉద్దేశపూర్వకంగా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. కేసు విచారణ కోర్టు లో ఉన్న సమయంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం. ఒక అమాయకురాలు మరణం, ఒక పసి పిల్లవాడి ప్రాణాలకు సంబంధించిన ఈ కేసు లో పోలీస్ శాఖ ఎంతో నిబద్దతతో విచారణ నిర్వహిస్తుంది. దానిపై బురద చల్లాలని చూస్తే అసలు సహించేది లేదు. ఈ ఘటనకు సంబంధించి ఎవరిదగ్గరైన సరైన ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే మాకు అందించవచ్చు’ అంటూ ఈ సందర్భంగా హెచ్చరించారు.

    వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలపై విశ్లేషకులు మాట్లాడుతూ ‘ ఈ విషయం లో అల్లు అర్జున్ అభిమానులు ఎంత సైలెంట్ గా ఉంటే, మీ హీరోకి అంత మంచిది. ఎందుకంటే అల్లు అర్జున్ రూల్స్ ప్రకారం నడుచుకోలేదు అనే విషయం నిర్దారణ అయ్యింది. నిన్న పోలీసులు అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన బిక్క మొహం వేయాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఇలా కాంగ్రెస్ కి వ్యతిరేక వర్గాలు సృష్టించిన ఫేక్ వీడియోలను ప్రచారం చేస్తూ వెళ్తే, అల్లు అర్జున్ ఇంకా సమస్యల్లో చిక్కుకుంటాడు. ఈ వ్యవహారం లో మీ హీరో బయటపడాలంటే, మీరు సైలెంట్ గా ఉండాలి’ అంటూ సలహాలు ఇస్తున్నారు. మరి ఇక నుండైనా అభిమానులు సైలెంట్ గా ఉంటారా లేదా అనేది చూడాలి.