https://oktelugu.com/

Trisha : హీరోయిన్ త్రిషకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా..? నా జీవితాన్ని శూన్యం చేసి వెళ్లిపోయాడంటూ కామెంట్స్!

రెండు దశాబ్దాల నుండి సౌత్ ఇండియా లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో ఒకరు త్రిష కృష్ణన్. తెలుగు, తమిళ భాషల్లో ఈమె దాదాపుగా స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 25, 2024 / 02:00 PM IST

    Trisha

    Follow us on

    Trisha : రెండు దశాబ్దాల నుండి సౌత్ ఇండియా లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో ఒకరు త్రిష కృష్ణన్. తెలుగు, తమిళ భాషల్లో ఈమె దాదాపుగా స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేసింది. హిట్లు, బ్లాక్ బూస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు కూడా అందుకుంది. మధ్యలో కొత్త హీరోయిన్స్ రాక వల్ల కాస్త డౌన్ అయ్యింది కానీ, మళ్ళీ ఇప్పుడు వరుసగా క్రేజీ సినిమాలతో సూపర్ హిట్స్ ని అందుకుంటూ దూసుకుపోతుంది. ఈమధ్య ఈమె చేసిన ప్రతీ సినిమా హిట్టే. ఇది ఇలా ఉండగా త్రిష కి ఒక కొడుకు ఉన్నాడు అనే విషయం ఈరోజే తెలిసింది. త్రిష పలువురు హీరోలతో ప్రేమాయణం నడిపింది అనే రూమర్స్ ని ఇన్ని రోజులు మనం వింటూ వచ్చాము. ప్రస్తుతం ఆమె తమిళ స్టార్ హీరో విజయ్ తో డేటింగ్ లో ఉంటున్నట్టు కూడా వార్తలు వినిపించాయి. అయితే ఇంతలోపే ఈమెకు కొడుకు కూడా పుట్టేసాడా?, ఇదెలా సాధ్యం అని అనుకుంటున్నారు కదూ!.

    అక్కడికే వస్తున్నాం..అసలు విషయం ఏమిటంటే త్రిష కి జోరో అనే పెంపుడు కుక్క ఉంది. ఈ కుక్క అంటే ఆమెకి ఎనలేని ప్రేమ. తన సొంత కొడుకు లాగా చూసుకుంటూ వచ్చింది. వీళ్లిద్దరి బంధం ఎదో రెండు మూడేళ్లకు సంబంధించినది కాదు. 2012 వ సంవత్సరం నుండి వీళ్లిద్దరి మధ్య బంధం ఉంది. అంటే 16 ఏళ్ళ బంధం అన్నమాట. ఎంతో ఆప్యాయంగా ఈ 16 ఏళ్ళు తన బిడ్డ లాగా పెంచుకుంటూ వచ్చింది త్రిష. అలాంటి బిడ్డ నేడు చనిపోయేలోపు ఆమె బాధ వర్ణనాతీతం అనే చెప్పాలి. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా లో తన అభిమానులతో పంచుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యింది.

    ఆమె మాట్లాడుతూ ‘నా కొడుకు జోరో క్రిస్మస్ పర్వదినాన, తెల్లవారుజామున కన్నుమూసాడు. నా మనస్తత్వం గురించి పూర్తిగా జోరో కి మాత్రమే తెలుసు. అలాంటి జోరో ఈరోజు నన్ను వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడాన్ని చూస్తుంటే, నా జీవితం కి ఇక అర్థం లేదని అనిపిస్తుంది. నేను, నా కుటుంబం మొత్తం ఇంకా షాక్ లోనే ఉన్నాం. ఈ ఘటన నుండి తేరుకోవడానికి మాకు చాలా సమయం పడుతుంది. అప్పటి వరకు నేను షూటింగ్స్ కి, ఇతర పనులకు దూరంగా ఉంటాను’ అని చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడిన ఈ మాటలను చూసి ఆమె అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు. జోరో ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతిని కోరుకోవాలని ప్రార్థిస్తున్నారు. 16 ఏళ్ళు నీతో కలిసి పెరిగిన ఒక జీవి చనిపోతే ఎంత బాధ ఉంటుందో ఊహించుకోగలం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా 16 సంవత్సరాలు ఒక మూగ జీవిని ఇంత ప్రేమగా చూసుకుందంటే, త్రిష మనసు ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు అని అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం త్రిష మెగాస్టార్ చిరంజీవి తో ‘విశ్వంభర’ అనే చిత్రం లో కలిసి నటిస్తుంది.