Mohan Babu : సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే గత కొద్ది రోజుల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు కూడా వివాదాల బాట పట్టడం అనేది చాలామందిని ఇబ్బందికి గురి చేస్తుందనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు సినిమాల కంటే కూడా వివాదాలే ఎక్కువగా ఫేమస్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న మోహన్ బాబు తన కొడుకులతో పెట్టుకున్న వివాదంలో టీవీ9 రిపోర్టర్ మీద దాడి చేశాడ. ఇక ఆ వివాదం ముగియక ముందే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విషయంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట లో రేవతి అనే మహిళ మృతి చెందడంతో అల్లు అర్జున్ మీద కేసు అయితే నమోదయింది. ఇలా ప్రతి ఒక్క వివాదం అనేది ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని చుట్టూ ముడుతున్నాయనే చెప్పాలి. మరి అల్లు అర్జున్ వివాదం ఒక కొలిక్కి వస్తుందా లేదా అనే విషయం పక్కన పెడితే మోహన్ బాబు మీద భారీ కసరత్తులు చేసి అతన్ని జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా మోహన్ బాబు రిపోర్టర్ మీద దాడి చేయడం అనేది చాలా వరకు ఖండించదగ్గ విషయమనే చెప్పాలి…
ఇక హైకోర్టులో అతనికి ఇచ్చిన ఉపశమనం గడువు అనేది నేటితో ముగియనుంది. కాబట్టి మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసినప్పటికీ హైకోర్టు ధర్మాసనం దాన్ని కొట్టి వేసినట్టుగా తెలుస్తోంది. ఇక దాంతో అతనికి నోటీసులను జారీ చేసి విచారణకు పిలుస్తారనే వార్తలైతే వెలువడుతున్నాయి. మరి మోహన్ బాబు మీద పెట్టిన కేసు ను రిపోర్టర్లు వెనక్కి తీసుకోకపోతే మాత్రం ఆయన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే వస్తుంది.
అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు కాబట్టి దాదాపు రెండు నుంచి మూడు నెలల వరకు అతనికి జైలు శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నట్టుగా న్యాయ నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. ఇక మోహన్ బాబు దాడి చేసిన సంఘటన వీడియోలో కూడా టెలికాస్ట్ అయింది. కాబట్టి ఆ వీడియోని హైకోర్టుకు సబ్మిట్ చేయబోతున్నారనే వార్తలైతే వస్తున్నాయి.
మరి ఇందులో మోహన్ బాబు తరపున న్యాయవాది ఎలా మాట్లాడుతారు ఆ దాడి వెనుక జరిగిన సంఘటన ఏంటి? అసలు గేటు లోపలికి రిపోర్టర్లు ఎందుకు వచ్చారు అనే ధోరణిలో ప్రశ్నలను లేవనెత్తనున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏం చేసినా కూడా మోహన్ బాబు అతని మీద దాడి చేసిన వీడియో అయితే ఉంది. కాబట్టి అదే స్ట్రాంగ్ సాక్ష్యంగా నిలబడబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ విషయంలో మోహన్ బాబు ఎక్కడ దాకా వెళ్తారు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉంది…