Adipurush Pre Release Event: ‘ఆది పురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నరేంద్ర మోడీ..? ప్లానింగ్ మాములు రేంజ్ లో లేదుగా!

వచ్చిన సినిమాలు వచ్చినట్టే థియేటర్స్ నుండి వెళ్లిపోతున్నాయి. సుమారుగా ఏడాది తర్వాత మన టాలీవుడ్ లో విడుదల అవ్వబోతున్న స్టార్ హీరో సినిమా, అందుకే ఈ చిత్రం పై ఫ్యాన్స్ తో పాటుగా ట్రేడ్ కూడా భారీ అంచనాలు పెట్టుకుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అమెరికా లో ప్రారంభం అయ్యింది.

Written By: Vicky, Updated On : May 25, 2023 2:05 pm

Adipurush Pre Release Event

Follow us on

Adipurush Pre Release Event: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం వచ్చే నెల 16 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు , హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం ఇటు టాలీవుడ్ ట్రేడ్ తో పాటుగా అటు బాలీవుడ్ ట్రేడ్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే సమ్మర్ లో రెండు ఇండస్ట్రీలలో సరైన సూపర్ హిట్ చిత్రం లేదు.

వచ్చిన సినిమాలు వచ్చినట్టే థియేటర్స్ నుండి వెళ్లిపోతున్నాయి. సుమారుగా ఏడాది తర్వాత మన టాలీవుడ్ లో విడుదల అవ్వబోతున్న స్టార్ హీరో సినిమా, అందుకే ఈ చిత్రం పై ఫ్యాన్స్ తో పాటుగా ట్రేడ్ కూడా భారీ అంచనాలు పెట్టుకుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అమెరికా లో ప్రారంభం అయ్యింది.

ఇక చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జూన్ 6 వ తేదీన హైదరాబాద్ లో ఘనంగా జరపబోతున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ప్రభాస్ నాన్ స్టాప్ గా ప్రొమోషన్స్ లో పాల్గొనబోతున్నాడు. ఇది ఇలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన హిందీ ప్రొమోషన్స్ ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మూవీ టీం. హిందీ లో త్వరలోనే ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరపబోతున్నారట. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని మూవీ టీం ముఖ్య అతిథిగా ఆహ్వానించిందట మూవీ టీం.

ప్రధాన మంత్రి కూడా సమయాన్ని చూసుకొని చెప్తాను, కుదిరితే కచ్చితంగా వస్తాను అని చెప్పాడట.ఒకవేళ ఆయన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి ‘ఆదిపురుష్’ చిత్రం గురించి మాట్లాడితే బాలీవుడ్ లో ఓపెనింగ్స్ ఊహాతీతం గా ఉంటాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి ప్రధాని వస్తున్నారో లేదో చూడాలి.