Anasuya Bharadwaj: నటి అనసూయ ట్వీట్ సంచలనం రేపుతోంది. ఆమె తనను వివాదాల్లోకి లాగవద్దంటూ సుదీర్ఘ సందేశం పోస్ట్ చేశారు. అనసూయ తన ట్వీట్స్ లో… కొందరు తన పేరున రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులను కించపరుస్తున్నారు. వివాదాల్లోకి నన్ను లాగుతున్నారు. నాకు ఎవరు పీఆర్లు లేరు. నేను సెల్ఫ్ మేడ్ ఉమన్. నా గురించి ఏదైనా నేనే మాట్లాడతాను. కాబట్టి నా పేరున ప్రచారమయ్యే వార్తల్లో నిజం లేదు. నేను ఒక మహిళను, నాకు కుటుంబం ఉంది. అనవసర వివాదాల్లోకి నన్ను లాగవద్దు,అంటూ రాసుకొచ్చారు. అనసూయ ట్వీట్స్ వైరల్ గా మారాయి.
మొన్నటి వరకు అనసూయ-విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య వివాదం నడిచింది. ఖుషి చిత్ర పోస్టర్లో విజయ్ దేవరకొండ పేరు ముందు The అని పెట్టడాన్ని అనసూయ తప్పుబట్టారు. పైత్యం బాగా ఎక్కువైందంటూ పరోక్షంగా విజయ్ దేవరకొండను ఎద్దేవా చేసింది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. ఆమెను ఆంటీ అంటూ ట్రోల్ చేశారు. వాళ్లకు ధీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే విజయ్ దేవరకొండను ఆమె టార్గెట్ చేయడం వెనుక కారణం తెలియజేసింది.
విజయ్ దేవరకొండ వద్ద ఉండే ఓ వ్యక్తి డబ్బులు ఇచ్చి నన్ను ట్రోల్ చేయించాడని తెలిసింది. అది విజయ్ దేవరకొండకు తెలియకుండా జరిగిందని నేను అనుకోను. అప్పటి నుండి నేను విజయ్ మీద పగ పెంచుకున్నాను. అందుకే అతన్ని టార్గెట్ చేశాను. ఇకపై నేను ఈ వివాదానికి ముగింపు పలకాలని అనుకుంటున్నానని చెప్పారు. ఆ వివాదం ముగిసిందని అనుకుంటుండగా అనసూయ అనుమానాస్పద ట్వీట్ చేసింది.
తనను కించపరిచే విధంగా కొందరు కుట్ర చేస్తున్నారన్నట్లు మాట్లాడారు. అసలు అనసూయను ఎవరు టార్గెట్ చేశారు. ఆమె ట్వీట్స్ వెనుక పూర్తి అంతర్యం ఏమిటో తెలియాల్సి ఉంది. సక్సెస్ఫుల్ కెరీర్ అనుభవిస్తున్న అనసూయను ఈ వివాదాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుతం అనసూయ పుష్ప 2 షూటింగ్ లో పాల్గొంటుంది. ఇటీవల ఆమె నటించిన విమానం విడుదలైంది. ఆ చిత్రంలో ఆమె వేశ్య పాత్ర చేశారు.
Hello everyone.. I have a request to make.. I’ve been coming across many tweets since few days.. where my name is being used as a mean comparison to disrespect others in political and entertainment industry.. which in turn is disrespectful to me too as my name is used as (1/4)
— Anasuya Bharadwaj (@anusuyakhasba) June 19, 2023