గ్లోబల్ బ్యూటీ అంటూ హడావుడి చేసే ముదురు భామ ‘ప్రియాంక చోప్రా’ తన బయోపిక్ గురించి కొన్ని ముచ్చట్లు చెప్పింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రియాంకను సదరు యాంకర్ ‘త్వరలో మీ బయోపిక్ మేము ఎక్స్ పెక్ట్ చెయ్యొచ్చా ? అని అడిగాడు. ఆ మాటకి ప్రియాంక చోప్రా తెగ బిల్డప్ ఇస్తూ ‘దయచేసి నా బయోపిక్ అడగొద్దు, అలాగే దాన్ని ఇప్పట్లో ఎవరూ తీయొద్దు.
నిజంగా నేను ప్రస్తుతానికి ఇదే బలంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇంకా సాధించాల్సింది చేయాల్సింది చాలా ఉందని నా నమ్మకం. బయోపిక్ అంటే సంపూర్ణ జీవితం కదా. నా జీవితంలో నేను మరెన్నో విజయాలను అందుకుంటాను. అలా అందుకున్నప్పుడు నేను ఆ దశకు చేరుకున్నప్పుడు బయోపిక్ తీస్తే బాగుంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక.
మొత్తానికి ప్రియాంక చోప్రాకి చాల గోల్స్ ఉన్నట్టు ఉన్నాయి. ఆ గోల్స్ లో మొదటి గోల్.. హోటల్ బిజినెస్ లో నెంబర్ వన్ అవ్వడం. ఇంటర్ నేషనల్ స్థాయిలో తన హోటల్స్ కి ఫుల్ డిమాండ్ రావాలట. ఇలాంటి కోరికలు కంటూ ఉంది ప్రియాంక. కోరికలే కాదు, ఆల్ రెడీ న్యూయార్క్ లో సోనా పేరిట ఇండియన్ రెస్టారెంట్ ను ఓపెన్ చేసి సక్సెస్ అయింది కూడా.
గతంలో రెస్టారెంట్ బిజినెస్ లో అనుభవం లేకపోయినా ప్రియాంక తన రెస్టారెంట్ లో సరికొత్త పద్ధతులు ప్రవేశ పెట్టి.. తన ఈ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా నడిపిస్తోంది. పైగా అతి తక్కువ టైంలో. తన రెస్టారెంట్ కి వచ్చే కస్టమర్స్ ను కొత్త స్కీమ్స్ తో ఆకర్షిస్తోంది. దీనికితోడు గ్లోబల్ బ్యూటీ వంటలు రుచి చూడాలనే ఆత్రుతతో కుర్రాళ్ళు కూడా ప్రియాంక రెస్టారెంట్ పైకి ఎగబడుతున్నారు. మొత్తానికి గ్లోబల్ బ్యూటీకి బాగానే కలిసి వస్తోంది.