Jayamalini- ANR: జయమాలిని, జ్యోతి లక్ష్మి అంటే తెలియనివారుండరు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల కాలంలో పేరు మోసిన ఐటమ్ భామలు వీరు. కమర్షియల్ సినిమా ఫార్మాట్ వచ్చాక వెండితెరపై జ్యోతిలక్ష్మి, జయమాలిని సిస్టర్స్ రెచ్చిపోయారు. రెండు దశాబ్దాలకు పైగా సినిమా లవర్స్ కి ఓ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ పంచారు. ఓ దశలో వీరి పాట లేకుండా సినిమా ఉండేది కాదు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో వందల సాంగ్స్ కి ఆడిపారు. జ్యోతిలక్ష్మి, జయమాలిని కలిసి చేసిన సాంగ్స్ కూడా పదుల సంఖ్యలో ఉంటాయి. మొదటి తరం ఐటెం భామలుగా వీరు చరిత్రకు ఎక్కారు.

మూడో తరం స్టార్ చిరంజీవి కూడా వీరితో ఆడిపాడారు. జ్యోతిలక్ష్మి మరింత ఫేమస్ కాగా అక్కకు ఏమాత్రం తగ్గని పాపులారిటీ జయమాలిని సొంతం. కాగా ఓ ఇంటర్వ్యూలో జయమాలిని లెజెండ్ నాగేశ్వరరావు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తనని ఏమన్నారో చెప్పి ఆశ్చర్యపరిచారు. ఓ రోజు సెట్స్ కి నాగేశ్వరరావుతో పాటు ఆయన భార్య అన్నపూర్ణమ్మ కూడా వచ్చారట.అన్నపూర్ణమ్మను చూసి జయమాలిని లేచి నిల్చొని నమస్కరించారట. తర్వాత అన్నపూర్ణ గారు జయమాలిని ఉద్దేశిస్తూ చెడ్డ అమ్మాయి అన్నారట.
ఇది మనసులో పెట్టుకోకుండా నాగేశ్వరరావు జయమాలిని పిలిచి మా ఆవిడ నిన్ను చెడ్డ అమ్మాయివి అంటుంది అన్నారట. మరో సందర్భంలో తన నడుము పై ఆయన చిలిపి కామెంట్ చేసినట్లు జయమాలిని చెప్పారు.నా నడుము పట్టుకున్న ఆయన… నీ నడుము ఏంటి ఇంత పెద్దగా ఉంది. రెండు చేతులతో పట్టుకున్నా చాలడం లేదన్నాడట. ఆ మాటకు పక్కనే ఉన్న నటుడు గిరిబాబు ఆ విషయం ఆమెను అడిగితే ఏం చెబుతుంది… వాళ్ళ అమ్మా నాన్నలను అడగాలని అన్నాడట.

సెట్స్ లో నాగేశ్వరరావు చాలా సరదాగా ఉండేవారని చెబుతూ జయమాలిని గతంలో జరిగిన ఈ సంఘటనలు గుర్తు చేసుకున్నారు.అలాగే ఏఎన్నార్ ని జయమాలిని మంచి డాన్సర్ గా అభివర్ణించారు.మొదటి డాన్సింగ్ హీరో అంటే నాగేశ్వరరావు గారే. ఆయనతో స్టెప్స్ వేయడం చాలా సరదాగా ఉండేది. ఏఎన్నార్ తర్వాత చిరంజీవి గొప్ప డాన్సర్ అంటూ జయమాలిని చెప్పుకొచ్చారు. తాజా ఇంటర్వ్యూలో జయమాలిని చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. 1975 నుండి 1991 వరకు జయమాలిని అనేక భాషల్లో ఐటెం భామగా సేవలు అందించారు.