https://oktelugu.com/

Anchor Anasuya : న్యూ ఇయర్ పార్టీలో తాగేసి గంతులేసిన యాంకర్ అనసూయ..వైరల్ అవుతున్న ఫోటోలు!

న్యూ ఇయర్ సందర్భంగా నిన్న రాత్రి ఆమె పార్టీ కి వెళ్లి సంబరాలు చేసుకున్నట్టు ఈ ఫోటోలను చూస్తే మనకి స్పష్టంగా అర్థం అవుతుంది. మత్తు కళ్ళతో ఉన్న ఆమె ఫోటోలను చూసి కచ్చితంగా ఈమె మద్యం సేవించింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఆమె వేసుకున్న బట్టలపై కూడా కామెంట్స్ చేస్తున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : January 1, 2025 / 07:03 PM IST

    Anchor Anasuya Viral Photos

    Follow us on

    Anchor Anasuya : బుల్లితెర పై యాంకర్ గా మంచి క్రేజ్ తెచ్చుకొని, ఆ తర్వాత సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న అనసూయ కి యూత్ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్ మీడియా లో ఈమె అప్లోడ్ చేసే ఫోటోలకు వేల సంఖ్యలో లైక్స్ కామెంట్స్ వస్తుంటాయి. అయితే అనసూయ అనేక సందర్భాలలో చాలా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయడం మనమంతా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఆమెకి హీరో విజయ్ దేవరకొండ అంటే పీకలదాకా కోపం ఉంటుంది. అతనిపై బహిరంగంగానే ఎన్నోసార్లు విమర్శలు కూడా చేసింది. అంతే కాదు తాను వేసుకున్న బట్టలపై ఎవరైనా కామెంట్స్ చేస్తే వాళ్లపై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది అనసూయ. అంతే కాదు వాళ్ళ మీద పోలీస్ కేసులు వేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ గా ఆమె అప్లోడ్ చేసిన ఫోటోలు కూడా వివాదాస్పదంగా మారింది.

    న్యూ ఇయర్ సందర్భంగా నిన్న రాత్రి ఆమె పార్టీ కి వెళ్లి సంబరాలు చేసుకున్నట్టు ఈ ఫోటోలను చూస్తే మనకి స్పష్టంగా అర్థం అవుతుంది. మత్తు కళ్ళతో ఉన్న ఆమె ఫోటోలను చూసి కచ్చితంగా ఈమె మద్యం సేవించింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఆమె వేసుకున్న బట్టలపై కూడా కామెంట్స్ చేస్తున్నారు. రేపు నీ పిల్లలు ఎదిగిన తర్వాత ఈ ఫోటోలు చూస్తే నిన్ను బాగా తిడుతారు అంటూ నెటిజెన్స్ ఆమె ఫోటోల క్రింద కామెంట్స్ చేస్తున్నారు. కానీ అనసూయ వాటిని పట్టించుకోకుండా, తనకి ఎలా అయితే ఉండాలని అనిపించిందో, అలా ఉంటుంది. అయితే ప్రతీ చిన్న కామెంట్ కి రెస్పాన్స్ ఇచ్చి ఫైర్ అయ్యే తత్త్వం ఉన్నటువంటి అనసూయ, ఇన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

    ఇదంతా పక్కన పెడితే అనసూయ ఇంస్టాగ్రామ్ తో పాటు, ట్విట్టర్ లో కూడా చాలా యాక్టీవ్ గా ఉండేది ఒకప్పుడు. కానీ ట్విట్టర్ లో నెగటివిటీ చాలా పీక్ రేంజ్ లో ఉండడంతో ఆమె ట్విట్టర్ ని వదిలి వెళ్ళిపోయింది. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గానే ఆమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ‘ ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో మరోసారి ఆడియన్స్ ని పలకరించింది. ఇది ఇలా ఉండగా ఈమె పవన్ కళ్యాణ్ నటించిన భారీ బడ్జెట్ పీరియడ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ లో కూడా ఒక ఐటెం సాంగ్ చేసింది. ఈ సాంగ్ అద్భుతంగా వచ్చిందని, విడుదలైన రోజు సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపేస్తుందని చెప్పుకొచ్చింది. మార్చి 28 వ తారీఖున ఈ చిత్రం విడుదల అవ్వబోతుంది. మరోసారి అనసూయ ఈ చిత్రం ద్వారా పాన్ ఇండియన్ ఆడియన్స్ ని పలకరించబోతుంది.