https://oktelugu.com/

Ram Charan : అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై ‘అన్ స్టాపబుల్’ షోలో రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్స్!

రీసెంట్ గానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'అన్ స్టాపబుల్ 4 ' లో ఒక ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో ఆయన అల్లు అర్జున్ తో తనకి ఉన్నటువంటి బంధం గురించి చెప్పుకొచ్చాడు. నిన్ననే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది. మరో రెండు మూడు రోజుల్లో, లేదా సంక్రాంతికి ఈ ఎపిసోడ్ లో ఆహా యాప్ లో స్ట్రీమింగ్ కాబోతుంది

Written By:
  • Vicky
  • , Updated On : January 1, 2025 / 07:16 PM IST

    Ram Charan's emotional comments on Allu Arjun's arrest

    Follow us on

    Ram Charan :  చాలా కాలం నుండి మీడియా లో మెగా, అల్లు కుటుంబాల మధ్య విబేధాలు ఏర్పడ్డాయని, రామ్ చరణ్ అల్లు ఫ్యామిలీ ని కాదని కొణిదెల ప్రొడక్షన్స్ ని స్థాపించడం వల్లే ఈ గ్యాప్ కి కారణమని మీడియా లో ఒక ప్రచారం తెగ హల్చల్ చేసింది. అయితే కేవలం ఒక రూమర్ మాత్రమేనని, మెగా, అల్లు కుటుంబాలు రెండు వేర్వేరు కాదని, రెండు ఒక్కటేనని ఎన్నో సందర్భాలలో నిరూపణ అవుతూ వచ్చింది. రీసెంట్ గా అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం పై ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అందుకు ఒక ఉదాహరణ. సంధ్య థియేటర్ లో జరిగిన దుర్ఘటనకు కేవలం అల్లు అర్జున్ ఒక్కడినే బాద్యుడిని చేయడం అన్యాయం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై టాలీవుడ్ హీరోలందరూ మౌనం వహించగా, పవన్ కళ్యాణ్ మాత్రం ధైర్యంగా తన అభిప్రాయాన్ని వ్యక్తపర్చడం అల్లు అర్జున్ అభిమానులకు బాగా నచ్చింది.

    అయితే రీసెంట్ గానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘అన్ స్టాపబుల్ 4 ‘ లో ఒక ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో ఆయన అల్లు అర్జున్ తో తనకి ఉన్నటువంటి బంధం గురించి చెప్పుకొచ్చాడు. నిన్ననే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది. మరో రెండు మూడు రోజుల్లో, లేదా సంక్రాంతికి ఈ ఎపిసోడ్ లో ఆహా యాప్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే ఈ ఎపిసోడ్ లో రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమాకి సంబంధించిన విశేషాలతో పాటు, తన కుటుంబ సభ్యుల గురించి, వాళ్ళతో తనకి ఉన్నటువంటి అనుబంధం గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు. ఆ సందర్భంలో అల్లు అర్జున్ గురించి, అతనితో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.

    అంతే కాకుండా రీసెంట్ గా జరిగిన అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం పై కూడా రామ్ చరణ్ చాలా ఎమోషనల్ గా స్పందించినట్టు ఈ ఎపిసోడ్ షూటింగ్ కి వెళ్లిన ఆడియన్స్ చెప్పుకొచ్చారు. ఈ ఎపిసోడ్ తో ఇన్ని రోజులు సోషల్ మీడియా లో ఒకరిపై ఒకరు దారుణమైన ట్రోల్స్ వేసుకున్న రామ్ చరణ్, అల్లు అర్జున్ అభిమానులు శాంతించే అవకాశాలు ఉన్నాయి. ఇది ‘గేమ్ చేంజర్’ చిత్రానికి చాలా ప్లస్ అవ్వొచ్చు. ఎందుకంటే ప్రతీ రోజు అల్లు అర్జున్ అభిమానులు గేమ్ చేంజర్ చిత్రం పై ఎదో ఒక విధంగా ట్రోల్స్ వేస్తూనే ఉన్నారు. ఇక మీదట అయినా వాళ్ళు శాంతిస్తారేమో చూడాలి. అయితే ఈ ఎపిసోడ్ సంక్రాంతికి వేస్తే ఉపయోగం ఉండకపోవచ్చు, ‘గేమ్ చేంజర్’ విడుదలకు ముందే వేస్తే బాగుంటుంది అని రామ్ చరణ్ అభిమానులు ఆహా టీం ని సోషల్ మీడియా లో ట్యాగ్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు.