Photo Story: ఒకప్పుడు ఈ బ్యూటీ స్టార్ హీరోలకు జోడిగా వరుస సూపర్ హిట్ సినిమాలలో నటించి సౌత్ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. కెరియర్ వరుస అవకాశాలతో బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ స్టార్ హీరోయిన్. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రస్తుతం మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్ గా మారింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఒకప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో బాగా గుర్తింపు ఉన్న తోపు హీరోయిన్.ఈమె ఎన్టీఆర్, సూర్య, అజిత్ వంటి స్టార్ హీరోలకు జోడిగా నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. తెలుగుతోపాటు ఈ బ్యూటీ మలయాళం, తమిళం, హిందీ భాషలలో కూడా అనేక సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ మరెవరో కాదు సమీరా రెడ్డి. మైనే దిల్ తుజుకో దియా అనే హిందీ సినిమాతో 2002లో సమీరా రెడ్డి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
Also Read: బెంగళూరు vs కోల్ కతా: ఎవరు గెలుస్తారు? గూగుల్ ప్రిడిక్షన్ ఏం చెబుతోంది?
గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన వారణం ఆయుర్ అనే సినిమాతో ఈమె సినిమా కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. తెలుగులో సమీరా రెడ్డి ఎన్టీఆర్ కు జోడిగా అశోక్, నరసింహుడు సినిమాలలో నటించింది. ఈ సినిమాలో సమీరారెడ్డి తన అందంతో, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన జై చిరంజీవ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. స్టార్ హీరో కు జోడిగా సమీరారెడ్డి సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలో నటించింది. వరుస అవకాశాలు వస్తున్న సమయంలో ప్రముఖ వ్యాపారవేత్త అక్షయ వర్ధన్ ను 2014లో పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సమీరా రెడ్డి చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మోహన్లాల్ తో కలిసి వరుణాల్వరం అనే సినిమాలో నటించడం జరిగింది.

సోషల్ మీడియాలో కూడా సమీరా రెడ్డి ఈ మధ్యకాలంలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఫిట్నెస్ పై కూడా ఈ బ్యూటీ కొన్నాళ్ళుగా అనేక విషయాలను అభిమానులతో పంచుకుంది. తన ఫిట్నెస్ జర్నీ గురించి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ అలాగే ఫిట్నెస్ కు సంబంధించి సూచనలు, సలహాలు కూడా అభిమానులకు ఇస్తుంది. హీరోయిన్ సమీరా రెడ్డి కథక్ నృత్యంలో కూడా ప్రత్యేక శిక్షణ తీసుకుంది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత సమీరారెడ్డి మళ్ళీ సినిమాలలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.