Nithiin Heroine: ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల నితిన్ కు జంటగా నటించింది. రీసెంట్ గా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమా ఫలితాన్ని అందుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చలో, భీష్మ సినిమాలతో టాలెంటెడ్ అర్సపొడిగా పేరు తెచ్చుకున్న వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అలాగే ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడం విశేషం. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు. దీంతో ఈ సినిమా రిలీజ్ కు ముందే ఈ సినిమా మీద ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. చాలా రోజుల నుంచి నితిన్ సక్సెస్ కోసం కష్టపడుతున్నాడు. చివరిగా ఇతను రాబిన్ హుడ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. గతంలో కూడా హీరో నితిన్ వరుసగా 13 సినిమాలతో ఫ్లాప్స్ అందుకున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన న్ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత నుంచి నితిన్ హిట్ అందుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. చాలాకాలం తర్వాత మళ్లీ ఇష్క్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.
Also Read: మరో చారిత్రాత్మక రికార్డుని నెలకొల్పిన ‘చావా’..10 వ వారం వచ్చిన వసూళ్లు ఎంతంటే!
ఈ సినిమాలో హీరో నితిన్ కు జోడిగా నిత్యామీనన్ నటించింది. ఇష్క్ సినిమాలో వీళ్ళిద్దరూ హిట్ పెయిర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మళ్లీ వీళ్ళిద్దరూ కలిసి గుండెజారి గల్లంతయ్యిందే అని సినిమాలో నటించారు. 2013లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. విజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలన్నీ కూడా బాగా ఫేమస్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో నిత్యామీనన్ తో పాటు మరో హీరోయిన్ కూడా కనిపించింది. ఈమె పేరు ఇషా తల్వార్. గుప్తా జ్వాల కూడా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్లో అలరించింది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
అయితే ఈ సినిమాలో ఇషా తల్వార్ తన నటనతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం తెలుగులో పెద్దగా రాణించలేకపోయింది. గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో ఇషా తెల్లవారి పాత్రకు నిత్యామీనన్ డబ్బింగ్ చెప్పింది. అయితే ప్రస్తుతం ఇషా తల్వార్ ఎలా ఉంది, ఏం చేస్తుంది అంటూ ఆమె అభిమానులు గూగుల్ మొత్తం గాలిస్తున్నారు. ఈమె తండ్రి బాలీవుడ్ నటుడు కావడంతో ఈమె కూడా బాలీవుడ్లో పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. తెలుగులో మైనే ప్యార్ కియా, రాజా చెయ్యి వేస్తే అనే సినిమాలలో నటించింది. ప్రస్తుతం ఈమె మలయాళం లో వరుస సినిమాలతో బిజీగా ఉంది.
Also Read: మహేష్ బాబు, దీపికా పదుకొనే కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా?