Photo Story: దేశంలో ఎన్నో సినిమా ఇండస్ట్రీలు ఉన్నా.. టాలీవుడ్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇక్కడ కొన్ని సినిమాల్లో నటిస్తే ఆ తరువాత ఇతర పరిశ్రమల్లో అవకాశాలు వస్తాయని చాలా మంది నమ్మకం. అందుకే కొందరు తమిళ, మలయాళ హీరోయిన్లు తెలుగులో నటించే చాన్స్ వస్తే అస్సలు వదులుకోలేదు. అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ తరువాత స్టార్లుగా మారారు. ఇలాగే ముంబయ్ కి చెందిన ఓ భామ తెలుగు సినిమాలపై విపరీతమైన ఆసక్తి ఉండేది. ఒక్కసారి నటిస్తే చాలు అనుకుంది. అలాగే అవకాశం తెచ్చుకున్న ఆమె ఆ తరువాత తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పెళ్లి చేసుకొని భర్తతో హ్యపీగా ఉంటూ.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. లేటేస్టుగా ఈమెకు సంబంధించిన ఓ చైల్డ్ హుడ్ పిక్ ఒకటి వైరల్ గా మారుతోంది. మరి ఆ విశేషాలేంటో చూద్దాం.
తెలుగు గడ్డపై ఈమె పుట్టకపోయినా.. అచ్చ తెలుగు ఆడపడుచులా ఉండే ఆమె ఎవరో కాదు స్నేహ. అందం, అభినయంతో పాటు ఆకర్షించే రూపం ఆమె సొంతం. అలాగని గ్లామర్ షో వైపు అస్సలు వెళ్లని ఆమె స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజారామ్, పద్మావతి దంపతులకు 1981 అక్టోబర్ 12న స్నేహ జన్మించారు. ఆ తరువాత వీరి కుటుంబం దుబాయ్ కి వెళ్లింది. అక్కడే పెరిగిన స్నేహను మొదటిసారిగా పాజిల్ అనే మలయాళ దర్శకుడు చూశాడు. ఈమె సినిమాల్లో నటిస్తే కెరీర్ బాగుంటుందని తల్లిదండ్రులకు సూచించాడు.
అలా 2000 సంవత్సరంలో ‘ఎంగెనా ఓరు నీల పక్ష’ అనే మలయాళ సినిమాలో స్నేహ మొదటిసారిగా కనిపించింది. ఆ తరువాత తెలుగులో ఆమెకు ‘తొలవలపు’ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. ఇది హీరో గోపి చంద్ కు కూడా డెబ్యూ మూవినే. ఈ మూవీ ప్లాప్ కావడంతో స్నేహకు గుర్తింపు రాలేదు. అయితే ఆ తరువాత తరుణ్ తో కలిసి ‘ప్రియమైన నీకు’ సినిమాలో నటించింది. ఈ సినిమా హిట్టు కొట్టడంతో స్నేహ స్టార్ గా మారిపోయారు. ఆ తరువాత ‘హనుమాన్ జంక్షన్’, ‘శ్రీరామదాసు’ చిత్రాలతో స్నేహ మరింత ఫేమస్ అయ్యారు. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ కమలాసన్ ‘బ్రహ్మచారి’ సినిమాలో స్నేహ కనిపిస్తారు.
ఓ వైపు సినిమాల్లో నటిస్తుండగా ఆమెకు డైరెక్టర్, నటుడు ప్రసన్నతో ఎఫైర్ ఉందన్నట్లు వార్తలు వచ్చాయి. కొన్నిరోజుల తరువాత ఇవి నిజమయ్యాయి. ఆ తరువాత వీరు 2012 మే 11న పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన తరువాత కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్న స్నేహ ఆ తరువాత 2014లో ఉలవచారు బిర్యాని సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో కనిపిస్తున్నారు. సినిమాల్లోనే కాకుండా బుల్లితెర పై కూడా స్నేహ సందడి చేస్తుంది. ఆమె చిన్నప్పటి పిక్ ఒకటి వైరల్ గా మారుతోంది. అందులో స్నేహ చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు.