https://oktelugu.com/

Girl Bungee Jumping: భంగీ జంపింగ్ చేస్తుండగా తాడు తెగింది.. ఆ యువతి కథ కంచికి చేరింది.. వైరల్ వీడియో

పసిఫిక్ ద్వీపంలోని పెంటెకోస్ట్ లో భంగీ జంప్ ను ఒక ఆచారంగా భావిస్తారు. పురుషులు ధైర్యంగా ఉన్నారా? లేదా? అని తెలుసుకోవడానికి ఈ భంగీ జంప్ పరీక్ష చేస్తారు. భంగీ జంప్ చేయాలనుకునేవారు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 16, 2023 / 11:34 AM IST

    Girl Bungee Jumping

    Follow us on

    Girl Bungee Jumping: ఎత్తైన కొండ నుంచి కిందికి చూస్తే కళ్లు తిరుగుతాయి.. మరి ఆ కొండ నుంచి కిందికి దూకితే పరిస్థితి ఏంటి? అలా దూకేస్తే అసలు మనం ఎక్కడున్నామో తెలియని విధంగా భయం పుడుతుంది. ఇలా దూకడానికి ధైర్య సాహసాలు కావాలి. కానీ ‘భంగీ జంపింగ్’ పేరుతో చాలా మంది ఇలాంటి సాహసాలు చేస్తుంటారు. ‘బావగారు బాగున్నారా’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఈ భంగీ జంప్ చేసి ఆకట్టుకున్నారు. ఆ తరువాత పలు సినిమాల్లో కొందరు హీరోలు ఇలాంటి ప్రయోగాలు చేశారు. అయితే లేటేస్టుగా ఓ యువతి భంగీ జంప్ చేసే ప్రయత్నం చేసింది. అంతలోనే తాడు తెగింది.. ఆ తరువాత ఏంజరిగిందంటే?

    పసిఫిక్ ద్వీపంలోని పెంటెకోస్ట్ లో భంగీ జంప్ ను ఒక ఆచారంగా భావిస్తారు. పురుషులు ధైర్యంగా ఉన్నారా? లేదా? అని తెలుసుకోవడానికి ఈ భంగీ జంప్ పరీక్ష చేస్తారు. భంగీ జంప్ చేయాలనుకునేవారు. కాలి చీల మండలానికి ఓ పెద్ద తాడును కడుతారు. కొండల పై నుంచి దూకేందుకు ఏర్పాట్లు చేస్తారు. అయితే కొండ కింది భాగంలో నది ఉండే విధంగా చూసుకుంటారు. ఏదైనా ప్రమాదం జరిగినా నీటిలో పడే విధంగా భంగీ జంప్ లాంచింగ్ ను సెట్ చేస్తారు. లేటేస్టుగా అనుకున్నట్లు ఓ యువతి కాలుకు కట్టిన తాడు తెగింది.

    సోషల్ మీడియాలో భంగీ జంప్ చేయబోయిన ఓ యువతికి అపశ్రుతి ఎదురైంది. లాంచింగ్ నుంచి ఆపరేటర్ ఆమెను కిందికి తోసేస్తాడు. అయితే కిందికి దూకే క్రమంలో ఆమె కాలుకున్న తాడు తెగుతుంది. దీంతో ఆమె నీటిలో పడిపోతుంది. ఈ వీడియో వివరాలు లేకున్నా.. ఇది వైరల్ గా మారుతోంది. ఈ క్రమంలో భంగీ జంప్ గురించి తీవ్ర చర్చ సాగుతోంది. భంగీ జంప్ ను ఇలా నదులు వద్దే కాకుండా కొందరు ఫ్లైట్ నుంచి కూడా దూకేస్తారు. అయితే అప్పుడే ఎయిర్ బెలున్లు, ప్యారా చుట్ లను నడుం కట్టుకొని దూకేస్తారు. ఇలాంటి సమయాల్లోనూ ప్రమాదాలు జరిగిన సంఘటనలు జరిగినవి ఉన్నాయి.

    సరదా కోసం భంగీ జంప్ చేయాలనుకునే వారు ఎక్కువగా స్విట్జర్లాండ్ కు వెళ్తుంటారు. అక్కడే భంగీ జంప్ కు అనువైన సౌకర్యాలు ఉంటాయి. పెద్ద పెద్ద కొండలు ఉండి.. వీటి మధ్య సెలయేర్లు పారుతూ ఉంటాయి. చాలా మంది ఇక్కడ భంగీ జంప్ చేసి తమ ధైర్య సాహసాలను పరీక్షించుకున్నారు. అయితే భంగీ జంప్ చేయాలనుకునేవారు హార్ట్ సమస్యలతో ఉండకూదని అంటున్నారు. అలాంటి సమస్యలు ఉన్నవారు వీటి జోలికి పోకుండా ఉండడమే మంచిదని చెబుతున్నారు.