Photo Story: చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తున్న సమయంలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఈ విధంగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తర్వాత అతి తక్కువ సమయంలో అదే పాపులారిటీతో హీరోగా లేదా హీరోయిన్స్ గా మారిన వాళ్లు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరించి ఆ తర్వాత హీరోయిన్స్ గా మారడంతో వాళ్ల సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తి చూపిస్తారు. ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిన్నారి ఈ సినిమాలో హీరోయిన్ గా చాలా బాగుంది అంటూ ప్రేక్షకులు అభిప్రాయపడతారు.అలా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించి ఇప్పుడు హీరోయిన్ గా చేస్తున్న వాళ్లలో అనీకా సురేంద్రన్ కూడా ఒకరు. అనికా సురేంద్రన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అందాల తార తెలుగు తెర మీద అనేక సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం హీరోయిన్ గా కూడా మారి తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. లేటెస్ట్ గా అనికా సురేంద్రన్ తన ఫోటో షూట్ తో కురాళ్ళకు నిద్ర లేకుండా చేస్తుంది.
Also Read: రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కి 2 ఏళ్ల జైలు శిక్ష..? కారణం ఏమిటంటే!
అందాల తార అనికా గురించి ప్రేక్షకులకు ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. విశ్వాసం, ఎంతవాడుగాని వంటి సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి అనికా బాగా ఫేమస్ అయ్యింది. వెండితెరపై పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. బుట్ట బొమ్మ సినిమాతో అనిత వెండితెరపై ఎంట్రీ ఇచ్చి తన నటనతో అందరిని ఆకట్టుకుంది. ధనుష్ జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాతో బాగా ఫేమస్ అయ్యింది ఈ చిన్నది. ఈ సినిమాతో అనికా యూత్ ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. చాలామంది ఈమె గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. అంతలా యూత్ ను తనవైపు తిప్పుకుంది ఈ బ్యూటీ.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన అంద చందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను అనికా సురేంద్రన్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలలో గౌన్ లో చూడడానికి చాలా అందంగా ఉంది. చాలా సింపుల్ లుక్ లో క్యూట్ గా స్మైల్ ఇస్తూ ఈ చిన్నది ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం అనికా సురేంద్రన్ కు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో అందరిని ఆకట్టుకుంటున్నాయి.