https://oktelugu.com/

నన్ను ఎన్ కౌంటర్ చేస్తామన్నారు: ‘పీపుల్ స్టార్’!

పీపుల్ స్టార్ ‘ఆర్‌. నారాయణమూర్తి’… ఆయనొక విప్లవం, ఆయనొక అతి సామాన్యం, నిరాడంబరతకు ఆయనొక నిలువెత్తు నిదర్శనం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి ఎంతైనా చెప్పొచ్చు. అలాంటి ఆదర్శమూర్తి ఆర్‌. నారాయణమూర్తి. ‘నేరము- శిక్ష’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి, ‘నీడ’ సినిమాతో హీరోగా ఎదిగిన ఆయన ఇప్పటికీ జనం సమస్యలనే కథలు గా ఎన్నుకుంటూ సినిమాలు చేస్తున్నారు. అయితే, నారాయణ మూర్తి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. […]

Written By:
  • admin
  • , Updated On : July 12, 2021 / 05:52 PM IST
    Follow us on

    పీపుల్ స్టార్ ‘ఆర్‌. నారాయణమూర్తి’… ఆయనొక విప్లవం, ఆయనొక అతి సామాన్యం, నిరాడంబరతకు ఆయనొక నిలువెత్తు నిదర్శనం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి ఎంతైనా చెప్పొచ్చు. అలాంటి ఆదర్శమూర్తి ఆర్‌. నారాయణమూర్తి. ‘నేరము- శిక్ష’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి, ‘నీడ’ సినిమాతో హీరోగా ఎదిగిన ఆయన ఇప్పటికీ జనం సమస్యలనే కథలు గా ఎన్నుకుంటూ సినిమాలు చేస్తున్నారు. అయితే, నారాయణ మూర్తి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

    పెట్టుబడి ప్రధానంగా ఉండే సినిమా రంగంలో ప్రేక్షకుల తరఫున విప్లవాత్మక సినిమాలను నాలుగు దశాబ్దాలుగా ఎలా చేయగలుగుతున్నారు ? అని అడిగితే.. ప్రేక్షకుల స్పందనే నా శక్తి. నిజానికి ఎందరో మహామహులు ఇలాంటి సినిమాలు తీస్తూ వచ్చారు. వారి బాటలో నేను ఒక చిన్న పిల్లాడిగా ఇన్నాళ్లు గెంతుతూ వచ్చాను. ఇంకా వస్తూనే ఉంటాను.

    నారాయణ మూర్తి తన చిన్ననాటి సంగతులు చెబుతూ.. నేను పుట్టి పెరిగిందంతా ఆంధ్రప్రదేశ్‌లోని రౌతులపూడిలోనే. చిన్న తనంలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కాంతారావు సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. వారి హావభావాల్ని స్నేహితులతో కలిసి ఇమిటేట్‌ చేస్తుండే వాడ్ని. బి.ఎ. పాసయ్యాను. ఆ తర్వాత సినిమా దయ వల్ల ఇండస్ట్రీకి వచ్చాను. 36 సంవత్సరాలుగా సినిమాలు చేస్తున్నాను.

    ఇక తన సినిమాల ప్లాప్స్ గురించి నారాయణ మూర్తి వివరణ ఇస్తూ.. ఈ జనరేషన్ వారికీ తెలియదు. 20 ఏళ్లు నా సినిమాలు బ్రహ్మాండంగా ఆడాయి. అయితే, నా విజయాలు చూసి, నా పంథాలో ఇతర నిర్మాతలూ, దర్శకులూ సినిమాలు తీయడం మొదలుపెట్టారు. దాంతో ప్రేక్షకులకు ఇలాంటి సినిమాల పై ఆసక్తి తగ్గింది. దాంతో ఇలాంటి సినిమాలు తీయడం మానేశారు. కానీ, నేను ఇంకా తీస్తూనే ఉన్నాను.

    తన దర్శకత్వంలో ఇతర హీరోలని పెట్టి సినిమాలు చేయకపోవడానికి నారాయణ మూర్తి కారణం చెబుతూ ‘ నేను హీరో అవ్వాలి. నా పోస్టర్‌ చూసి జనం ఆనందపడాలి అనుకున్నాను. నా అదృష్టమో, దేవుడి దయో ఈ రోజు నేను హీరో అయ్యాను. ఈ స్థాయికి వచ్చాను. ఇక నేను హీరో స్థాయిలో ఉండి, నా సినిమాలో ఇంకో హీరోని నేను ఎందుకు పెట్టుకుంటానండి అంటూ చెప్పుకొచ్చారు.