Peddi Movie Latest Updates: ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ‘పెద్ది'(Peddi Movie) గురించే చర్చ నడుస్తోంది. బుచ్చి బాబు(Buchi Babu Sana) దర్శకత్వం లో రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటిస్తున్న ఈ చిత్రం నుండి నేడు ‘చికిరి..చికిరి’ పాట విడుదలైంది. ఈ పాటకు సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి డివైడ్ టాక్ వచ్చింది. ఇదే ట్యూన్ గతం లో ఎక్కడో విన్నట్టుగా ఉందే?, శంకర్ ‘ఐ’ చిత్రం లోని ‘పరేశానయ్యా’ పాట స్టైల్ లో ఉంది కదూ అంటూ సోషల్ మీడియా లో ట్రోల్స్ వేస్తున్నారు. అంతే కాకుండా ఈ పాటలో రామ్ చరణ్ వేసిన స్టెప్పులు ‘వార్ 2’ లోని ఎన్టీఆర్ స్టెప్పులకు దగ్గరగా ఉన్నాయని కూడా సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపించాయి. ఆ కామెంట్స్ ని చూస్తే నిజమే కదా అని కూడా అనిపించొచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈరోజు విడుదల చేసిన పాటలో కొన్ని బ్లూపర్ షాట్స్ ఉన్నాయి.
ఆ షాట్స్ లో సుకుమార్(Sukumar) కూడా ఉన్నాడు. ఈ చిత్రం డైరెక్టర్ బుచ్చి బాబు సుకుమార్ కి శిష్యుడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఎన్నో ఏళ్ళ నుండి సుకుమార్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రానికి కూడా బుచ్చి బాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. అదే విధంగా పుష్ప సిరీస్ కి కూడా ఆయన రైటింగ్ డిపార్ట్మెంట్ లో పని చేసాడు. ఇప్పుడు పెద్ది మూవీ షూటింగ్ లో సుకుమార్ ఉన్న షాట్స్ ని చూస్తుంటే, కచ్చితంగా ఈ చిత్రం డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో సుకుమార్ హ్యాండ్ కచ్చితంగా ఉండే ఉంటుందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. ఆయన సలహాలతోనే బుచ్చి బాబు ఈ సినిమాని తెరకెక్కించి ఉంటాడని, ఫైనల్ ఔట్పుట్ చూసిన తర్వాత సుకుమార్ ఈ సినిమా పట్ల పలు మార్పులు చేర్పులు కూడా సూచించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియదు కానీ, ఒకవేళ సుకుమార్ తలదూరిస్తే మాత్రమ్ సినిమాలో ఉన్న ఫీల్ పోతుంది అని చెప్పొచ్చు. సుకుమార్ గొప్ప డైరెక్టర్, అందులో ఎలాంటి సందేహం లేదు, కానీ ఒక డైరెక్టర్ విజన్ తో తీసే సినిమాకు, మరో డైరెక్టర్ విజన్ కూడా తోడైతే కిచిడీ అయ్యే ప్రమాదం ఉంది. గతంలో ఎన్నో సినిమాల ఫలితాలు ఇలాగే గాడి తప్పాయి. ‘పెద్ది’ తర్వాత రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వం లోనే సినిమా చేయబోతున్నాడు. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్, లేదా వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.
