Divvela Madhuri and Duvvada Srinivas: మీడియా రిపోర్టర్స్ లో జాఫర్(Jaffar) స్టైల్ ఎలాంటిదో మనమంతా చూసాము. పెద్ద పెద్ద సెలబ్రిటీలనే ఒక ఆట ఆడించిన వ్యక్తి ఆయన. అడిగే ప్రతీ ప్రశ్న చాలా సూటిగా, సుత్తి లేకుండా ఉంటాయి. ఎంత పెద్ద సెలబ్రిటీ ని అయినా ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు అడగడం ఆయన స్టైల్. అందువల్ల అనేక సందర్భాల్లో గొడవలు కూడా అయ్యాయి. అలాంటి జాఫర్ తో చెడుగుడు ఆదుకున్నారు దువ్వాడ దంపతులు. ప్రముఖ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్(Duvvada Srinivas) సతీమణి దివ్వెల మాధురి(Divvela Madhuri) రీసెంట్ గానే ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. కేవలం మూడు వారాలకే ఈమె ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఈమె ఇచ్చిన అనేక ఇంటర్వ్యూస్ లో జాఫర్ ఇంటర్వ్యూ ఒకటి. ఈ ఇంటర్వ్యూ లో ఆమెతో పాటు దువ్వాడ శ్రీనివాస్ కూడా పాల్గొన్నాడు.
ఈ ఇంటర్వ్యూ మొత్తం ఫుల్ ఫన్ తో సాగిపోయింది. మధ్యలో జాఫర్ అడిగిన ప్రశ్నలకు దివ్వెల మాధురి ఫైర్ అయ్యింది, ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఇంటర్వ్యూ ఆపేస్తా అని వార్నింగ్ కూడా ఇచ్చింది, ఇలాంటివన్నీ జరిగాయి. కానీ మధ్యలో జాఫర్ ని దువ్వాడ దంపతులు ఆదుకున్న తీరుని చూస్తే పగలబడి నవ్వుకోవాల్సిందే. మొట్టమొదటిసారి జాఫర్ సమాధానం చెప్పలేక నవ్వుకోవాల్సి వచ్చింది. ఇంతకీ అసలు ఏమైందంటే జాఫర్ మాధురి ని ఒక ప్రశ్న అడుగుతూ ‘చపాతి కోసం ఏడవడం ఏంటి అండీ?’ అని అడగ్గా, అప్పుడు దువ్వాడ శ్రీనివాస్ మాధురి కి బదులుగా సమాధానం చెప్తూ ‘ఈయన కూడా బిగ్ బాస్ కి వెళ్ళాడు గా, ఆ అనుభవం ఉంది’ అని అంటాడు. ఈయన కూడా చపాతి కోసం ఫైటింగ్ చేశాడా అని మాధురి అడగ్గా, దానికి శ్రీనివాస్ సమాధానం చెప్తూ ‘చపాతి ఏంటి..ఇతను మంచి నీళ్ల కోసం కూడా ఫైటింగ్ చేసాడు’ అని ఎగతాళిగా నవ్వుతాడు.
ఆ తర్వాత శ్రీనివాస్ జాఫర్ ని మరో ప్రశ్న అడుగుతూ ‘మీరు ఎన్నాళ్ళు ఉన్నారు సార్ బిగ్ బాస్ హౌస్ లో?’ అని అడుగుతాడు. దానికి జాఫర్ రెండు వారాలు అని సమాధానం చెప్తాడు. ‘ఈమె 20 రోజులు హౌస్ లో ఉంది. 20 రోజుల తర్వాత ఆమె మీకంటే బెటర్ గా వచ్చింది. మీరు రెండు వారాలకే డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు’ అని అంటాడు. అప్పుడు జాఫర్ ‘నాకు మా ఆవిడ గుర్తుకొచ్చింది’ అని అంటాడు. నాకు కూడా మా ఆయన, పిల్లలు గుర్తుకొచ్చారు, మీకే కాదు అని మాధురి నవ్వుతూ సమాధానం చెప్తుంది. మీరింత స్ట్రాంగ్, ప్రతీ ఒక్కరిని పాయింట్ బ్లాంక్ లో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, కానీ బిగ్ బాస్ కి వెళ్ళాక ఏమైంది ఆ ధైర్యం అంటూ దువ్వాడ శ్రీనివాస్ ఎగతాళి గా మాట్లాడడం, పాపం జాఫర్ సమాధానం చెప్పలేక ముసిముసి నవ్వులు నవ్వుకోవడం హైలైట్ గా నిల్చింది. సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్న ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.
— dineshuu (@diineshuu) November 7, 2025