Peddi Trailer Highlights: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమా నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ సెన్సేషన్ సృష్టించింది ఫ్యాన్స్ లోనే కాకుండా ఆడియన్స్ లో కూడా విపరీతమైన పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేలా చేసింది. అయితే రెండు సార్లు ఈ చిత్రాన్ని వాయిదా వెయ్యడం తో ఆడియన్స్ లో ఈ చిత్రం పై ఉన్న అంచనాలు కాస్త తగ్గిన విషయం వాస్తవమే. ఆ ప్రభావం ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ పై చాలా బలంగా పడింది. 3 మిలియన్ డాలర్లు కేవలం ప్రీమియర్ షోస్ నుండి వస్తాయని అనుకుంటే , కనీసం 1.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు కూడా వచ్చేలా కనిపించడం లేదు. అయితే ఈ నెల 18 న ముంబై లో విడుదల చేయబోతున్న థియేట్రికల్ ట్రైలర్ తర్వాత ఈ చిత్రం పై అంచనాలు తారా స్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
థియేట్రికల్ ట్రైలర్ నిడివి 2 నిమిషాల 35 సెకండ్ల వరకు ఉంటుందట. ఈ ట్రైలర్ లో పంచ్ డైలాగ్స్ తో పాటు, ఫైట్ షాట్స్, సినిమా స్టోరీ ని జనాలకు పూర్తిగా అర్థం అయ్యేలా చేస్తుందట. ముఖ్యంగా చివరి 10 సెకండ్స్ లో వచ్చే షాట్ ఆడియన్స్ ని మెంటలెక్కిపోయేలా చేస్తుందని, రామ్ చరణ్ ని ఇష్టపడని వాళ్ళు కూడా ఆ షాట్ ని చూసిన తర్వాత టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఎగబడుతారని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే , మరోపక్క మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ ని వేరే లెవెల్ లో ప్లాన్ చేయబోతున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ ని కూడా నేడు విడుదల చేశారు. జూన్ 18 నుండి సోషల్ మీడియా లో ‘పెద్ది’ తప్ప మరో పేరు వినిపించని రేంజ్ ప్లానింగ్ ఇది.
ముందుగా ముంబై లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. తెలుగు తో పాటు , అన్ని భాషలకు సంబంధించిన ట్రైలర్స్ కూడా అదే రోజున విడుదల కాబోతున్నాయి. అదే విధంగా ఈ నెల 22 న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగబోయే సన్ రైజర్స్ హైదరాబాద్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ మ్యాచ్ లో కూడా మూవీ టీం సందడి చేయనుంది. రామ్ చరణ్ కూడా ఈ మ్యాచ్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక 23 వ తేదీన భూపాల్ లో స్పెషల్ సాంగ్ ని విడుదల చేయబోతున్నారు. అందుకు ఒక భారీ మ్యూజికల్ ఈవెంట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు , AR రెహమాన్ లైవ్ పెర్ఫార్మన్స్ ని ఇందులో చూడొచ్చు. అదే విధంగా 24 న బెంగళూరు లో , 28 న ఢిల్లీ లో , 30 న చెన్నై లో ప్రెస్ మీట్స్ ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక చివరిగా జూన్ 1 న విజయనగరం లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, జూన్ 2 న హైదరాబాద్ లో మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేయబోతున్నారు.